భార్యను చంపేసి సాగు భూమిలో పాతిపెట్టిన భర్త.. ఉప్పు చల్లి పంట వేశాడు: యూపీ పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని వ్యవసాయ భూమిలో పాతిపెట్టి 30 కిలోల ఉప్పు చల్లాడు. అనంతరం, పంట వేసి పెంచాడు. అతనే పోలీసులను ఆశ్రయించి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని సాగు భూమిలో పాతిపెట్టాడు. ఎవరికీ అనుమానం రావద్దని 30 కిలోల ఉప్పు తీసుకువచ్చి మీద చల్లాడు. తద్వార బాడీ తొందరగా డికంపోజ్ అవుతందని అనుకున్నాడు. తర్వాత పాతిపెట్టిన చోటే పంట వేశాడు. ఈ ఘటన గజియాబాద్‌లో జనవరి 25వ తేదీన జరిగింది.
దినేశ్ అనే కూరగాయల వ్యాపారికి తన భార్యకు ఇంటి విషయమై వాగ్వాదం జరిగింది. అది గొడవగా పరిణమించింది. అదే కోపంలో భర్త ఆమె గొంతు నులిమేశాడు. ఆమె మరణించింది. ఒక రోజు ఆమె డెడ్ బాడీని తనతోనే ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రంలో పాతిపెట్టాడు. ఆ డెడ్ బాడీ వేగంగా కుళ్లిపోవడానికి 30 కిలోల ఉప్పు వేశాడు. ఆ తర్వాత పాతిపెట్టిన చోటే పంట వేశాడు. తద్వార ఎవరూ అటు వైపు వెళ్లకుండా.. అనుమానం రానివ్వకుండా జాగ్రత్తపడ్డాడు.
కొన్ని రోజుల తర్వాత దినేశ్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. తన భార్య మిస్ అయినట్టు కంప్లైంట్ చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదని, బహుశా అతడే ఆమెను చంపేసి ఉంటాడని ఆరోపించాడు. అయితే, పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు.