కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిందిపోయి.. కామాంధులకు ఆహారం కావాలంటూ వేధించాడు. తన స్నేహితులతో రాత్రి గడుపు అంటూ.. కట్టుకున్న భార్యను ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగలేదు.. తన భార్యను స్నేహితులకు అప్పగించి.. వారి భార్యలతో తాను కూడా గడపాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో కూడా చెప్పాడు. నువ్వు నా స్నేహితులతో గడిపితే.. నేను వాళ్ల భార్యతో గడిపే అవకాశం దొరుకుతందని చెప్పాడు. భర్త మనసులో ఉన్న నీచమైన ఆలోచన విని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.   ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ(43) చాలా సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే..కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. అంతటితో ఆగకుండా తన మగ స్నేహితులతో సరసాలాడాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. 

అలా చేస్తే ఆ మిత్రుల భార్యలతో సరదాగా గడపడానికి ఆ స్నేహితులు ఒప్పుకున్నారని, అందుకే భర్త తనపై ఒత్తిడి తెచ్చాడని వెల్లడించింది. ఈ బాధ భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పి, తన నగలు ఇచ్చేయమంటే భర్త కుటుంబం నిరాకరిస్తోందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.