యూట్యూబ్‌లో డెలివరీ చూసి.. భార్యపై ప్రయోగించిన భర్త.. మరణించిన భార్య

Husband follows Youtube for attempt home birth
Highlights

వంట ఎలా చేయాలి.. పంట ఎలా కోయాలి అన్న దగ్గరి నుంచి బాంబులు ఎలా తయారు చేయాలన్నది కూడా తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో తెగ వెతికేస్తున్నారు. అంతలా యూట్యూబ్ ఒక కళాశాలగా... ఒక ట్రైనింగ్ సెంటర్‌లా మారిపోయింది. దీనిని అంత గుడ్డిగా ఫాలో అవుతున్నారు జనాలు. తాజాగా ప్రసవం ఎలా చేయాలో చూసి దానిని భార్యపైనే ప్రయోగించాడు ఓ భర్త. చివరికి ఆ ప్రయోగం వికటించి ఆమె మరణించింది. 

తమిళనాడులోని తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. వీరిద్దరికి ఇప్పటికే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉండగా.. మళ్లీ కృతిక గర్భం దాల్చింది. నెలలు నిండిన భార్యకు తానే పురుడు పోయాలని అనుకున్నాడు.. ఇందుకు గానూ యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఓ అవగాహనకు వచ్చాడు.

నెలలు నిండటంతో ఆమెకు నొప్పులు వచ్చాయి... తానే నీకు డెలీవరి చేస్తానని.. ఆమె అనుమతితోనే వీడియోలో చెప్పినట్లుగా చేశాడు... అయితే బిడ్డ పుట్టిన తర్వాత కృతికకు తీవ్ర రక్తస్రావమై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. దీంతో భయపడిపోయిన ఆమె భర్త వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కృతిక బిడ్డకు జన్మనిచ్చి అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.
 
loader