Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం: హోటల్‌ రూమ్‌లో లవర్‌తో అడ్డంగా బుక్కైన భర్త.. చెప్పుతో బుద్ధి చెప్పిన భార్య (వీడియో)

భర్త తన లవర్‌ను వెంటబెట్టుకుని హోటల్ గదిలో దిగాడు. వారు ఎంజాయ్ చేస్తుండగా.. ఈ విషయం తెలుసుకున్న భార్య క్షణాలో ఆ హోటల్ గదిలోకి ప్రవేశించింది. రాగానే.. చెప్పులు తీసి భర్తపై దాడికి దిగింది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళపైనా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

husband caught with lover in hotel room red handedly by wife video viral
Author
First Published Sep 21, 2022, 5:36 PM IST

లక్నో: వివాహేతర సంబంధాలు సంసారాల కొంప ముంచుతాయి. భార్య భర్తల మధ్య ఉన్న దూరాన్ని అందలేనంతగా చేస్తాయి. తర్వాత ఆ కుటుంబ బాధ్యతలను గాడిలో పెట్టడానికి రెట్టింపు కృషి అవసరం అవుతుంది. వివాహేతర సంబంధం బయట పడ్డాక మళ్లీ రాజీపడి భార్య భర్తలు కలిసి ఉన్నప్పటికీ వారి మధ్య అనుమానాలదే పైచేయి అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంటే టెక్నాలజీ నిత్యజీవితంలోకి వచ్చిన తర్వాత వివాహేతర సంబంధాలు ఎక్కువగా బట్టబయలు అవుతున్నాయి. ఇప్పుడు మరీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటనలు, వాటి తాలూకు వీడియోలూ సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నాయి. ఇలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఆ వీడియోలో కనిపిస్తున్న దంపతులు సుమారు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరి సంతానం కూడా కలిగింది. అంతా సజావుగానే సాగుతున్నదని అనుకునే క్రమంలో ఆమె భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం బంధువుల ద్వారా ఆ భార్యకు తెలిసింది. తెలియగానే భర్తను నిలదీసింది. కానీ, దాటవేశాడు. ఆ తర్వాత కొన్ని ఆధారాలతో ప్రశ్నించింది. ఇక మీదట ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించింది. కానీ, వాటిని ఆ భర్త ఖాతరు చేయలేదు. అంతేకాదు, ఏకంగా తన లవర్‌ను ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు.

అనుకున్నట్టే లవర్‌ను ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయం సదరు వ్యక్తి భార్యకు తెలిసింది. అంతే.. క్షణాల్లో ఆ హోటల్‌లో వాలిపోయింది. హోటల్ గదిలోకి ప్రవేశించి వెంటనే చెప్పు తీసి భర్తపై దాడి చేయడం ప్రారంభించింది. మధ్య మధ్యలో తన భర్తతో సంబంధం నెరపుతున్న వగలాడికీ అంటించింది. అంతటితో ఆగలేదు. తన భర్తపై ఆమెనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios