ఓ కసాయి భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్థాంగిని బతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టాడు. దీనికి తన తమ్ముడు, స్నేహితుడి సాయం తీసుకున్నాడు. ఆ తరువాత విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్నాడు.

తమిళనాడు : బతికుండగానే wifeను పూడ్చి పెట్టాడు ఓ కిరాతక భర్త. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి నిందితుడుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు arrest చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. tamilnadu వేలూరు సమీపంలోని కాట్పాడి వడుకన్ తాంగల్ కు చెందిన వినాయకం.. ప్రైవేటు ఉద్యోగి. గుడియాత్తం నివాసి suprajaను (25) ప్రేమించి నాలుగేళ్ల కిందట పెళ్ళాడాడు. దంపతులు కేవీ కుప్పం సమీపంలోని మడినాంపట్టులో నివాసముంటున్నారు. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. 2 నెలల క్రితం సుప్రజ అనారోగ్యానికి గురయ్యింది. అప్పుడు wife and husband మధ్య గొడవలు జరిగాయి. భార్యను వినాయకం తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

అయితే, ఆమె చనిపోయిందని భావించిన వినాయకం వెంటనే తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. శుక్రవారం అర్ధరాత్రి కవసంబట్టు చక్కెర తోపు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవంగా పాతిపెట్టారు. సుప్రజ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సెంథిల్ కుమారి కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. సుప్రజ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

మరో ఘటనలో..
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 3న భార్యను అత్యంత దారుణంగా murder చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన ఘటన Delhiలో చోటు చేసుకుంది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త ఘటన జరిగిన రోజు ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి police stationకు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను Scissorsతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండర్, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు. 

పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటన మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

చంపేసి.. పంటపొలాల్లోకి తీసుకెళ్లి.. 
జనవరి 13న నిజామాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్నwifeనే కడతేర్చాడో ప్రబుధ్దుడు. తల మీద కట్టెతో కొట్టి హతమార్చిన భర్త.. deadbodyన్ని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చేశాడు. పూర్తిగా కాలకపోవడంతో murder విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సరదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని బల్ రాం పూర్ జిల్లాకు చెందిన ఫాతిమా ఖాతూన్ (26), రంజాన్ ఖాన్ దంపతులు ఉపాధి కోసం మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతానికి వలస వచ్చారు. 

వీరికి నలుగురు పిల్లలు.. కూలీ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వారు. అయితే, ఫాతిమాకు విలాసవంతంగా బతకాలనే ఆశ ఉండేది. ఇందుకోసం డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది. ఇది మనసులో పెట్టుకున్న భర్త రంజాన్ ఖాన్ భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 24న ఫాతిమా తల మీద దుడ్డు కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్ ఖాన్, పూజన్ లతో కలిసి పథకం రచించాడు. 

అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొలెరో వాహనంలో మృతదేహాన్ని తీుకుని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారుకు చేరుకున్నారు. పంట పొలాల్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అయితే, పొలాల్లోకి వెళ్లిన రైతులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు.