కర్ణాటకలో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని..ప్రియుడితో పరార్ అయ్యింది. దీంతో ఉన్మాదిగా మారిన భర్త కూతుళ్లను దారుణంగా హతమార్చాడు.
కర్ణాటక : కర్ణాటకలోని యశ్వంతపురలో ఘోర సంఘటన జరిగింది. భార్య వేరొకరితో వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. ఏం చేస్తున్నాడో తెలియని మానసిక స్థితిలో ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్యచేశాడు. ఈ ఘటన కర్నాటక కలబురిగిలో జరిగింది. వివరాలు.. భోవి నగరకు చెందిన లక్షీకాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇదికాస్తా ముదిరి ప్రియునితో కలిసి పారిపోయింది. దీంతో లక్ష్మీకాంత్, అంజలిల నలుగురు పిల్లలను అవ్వ దగ్గర ఉంచాడు.
బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కూర్చోబెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు.. సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
రెండో భర్త మందలించాడని.. మూడో పెళ్లి చేసుకొని భార్య పరారీ.. ఎక్కడంటే ?
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలో కట్టుకున్న భర్తే భార్యను కిరాతకంగా హతమార్చాడు. కొడుకు చేస్తున్న దారుణాన్ని అడ్డుకోవాల్సిన అత్తామామలు ఆ పని చేయలేదు. ఇంకా దారుణమైన ఘటన ఏంటంటే కన్నపిల్లలు ఎదుటే ఈ ఘటన జరగడం. శుక్రవారం సాయంత్రం కంచిలి మండలం పద్మతుల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పిట్టా శ్రీనుకు.. పదకొండేళ్ల కిందట పుష్ప(30)తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక బాబు ఉన్నారు. పిట్ట శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి ఈ మధ్యకాలంలో భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది అని అనుమానం వచ్చింది.
ఈ అనుమానంతోనే నిరుడు ఆమె మీద దాడి చేశాడు. దీంతో కేసు కంచిలి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఆ తర్వాత కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ అదే గ్రామంలో.. వేరువేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవుల మీద గ్రామానికి వచ్చాడు. ఇదే సమయంలో పుష్ప వేరే ఊరికి వెళ్ళింది. తన కన్నవారి ఊరు ఇచ్చాపురంలో గ్రామ దేవతల సంబరాల కోసం.. పిల్లలను తీసుకుని పిన్ని ఇంటికి వెళ్ళింది. వారం రోజుల తర్వాత తిరిగి శుక్రవారం పద్మతులకు వచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి.. భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగలగొట్టాడు. వేరే తాళాలు వేసుకుని తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్ళాడు.
ఇంటికి తిరిగి వచ్చిన పుష్ప ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, వేరే తాళం వేసి ఉండటం గమనించింది. ఇదంతా భర్త పనే అని అనుమానించింది. ఆ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లింది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంది. సాయంత్రం పిల్లల్ని ఇంటికి తీసుకు వద్దామని భర్త ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలో మామ నూకయ్య దురుసుగా ప్రవర్తించాడు. ‘నీకు పిల్లలు కావాలా’ అంటూ ఆమె మీద దాడికి దిగాడు. అతనికి అత్త కూడా తోడైంది. అత్త సాయమ్మ, మామ నూకయ్య కలిసి పుష్పను రోడ్డుపైకి నెట్టేశారు. నూకయ్య, శ్రీను ఇద్దరూ ఆమె పీక నులిమారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వారు అలా చేస్తున్న సమయంలో చంపేయాలి అంటూ సాయమ్మ ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు.
