ఇంట్లోనే ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది ఓ భార్య.. ఆ విషయం తెలిసి భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. కానీ భర్త అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు...

మధ్యప్రదేశ్ : సాక్షాత్తు కట్టుకున్న husband తన wifeను ఇంట్లో ప్రియుడితో కలిసి చూడరాని స్థితిలో చూశాడు. ఇక ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఇద్దరినీ పట్టుకుని చెట్టుకు కట్టేసి మరీ చితకబాదాడు. ఈ సంఘటన madhyapradeshలోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భర్త కళ్లుగప్పి ఓ మహిళ చెయ్యకూడని తప్పు చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోనే extramarital affairని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. 

అయితే ఎట్టకేలకు ఆ వివాహిత నిజస్వరూపం బయటపడింది. కాగా ఓ రోజు ఇంట్లోనే తన భార్యను మరో వ్యక్తితో చూడడంతో భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన తప్పుడు పని గ్రామస్తులు అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆ భర్త. దాంతో ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి భార్యతో పాటు తన ప్రియుడికి కూడా దేహశుద్ధి చేశారు. వివాహితతో పాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేయడానికి సదరు భర్త బంధువులు కూడా అతనికి అండగా నిలిచారు. ఇలా రెండు గంటల పాటు ఇద్దరిని చితకబాదుతుండగా.. వాళ్ళ అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

అయితే స్థానికులు దీనికి సంబంధించిన దృశ్యాలను షూట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. భర్తతో కాపురం చేస్తూనే మరో వైపు ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం బయట పడడంతో గ్రామస్తులు కూడా వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భర్త దేహశుద్ధి చేస్తుండగా అందరూ అతనికి మద్దతుగా నిలిచి మహిళను తిట్టి పోశారు. 

ఇదిలా ఉండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టుకు కట్టేసి వివాహితతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు.. భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ వారిని శిక్షించడాన్ని తప్పుపట్టారు. వారిపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరిని కలిపేందదుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, చెన్నూరు మండలం కొండ పేట గ్రామం వనంవీధిలో నివసించే కె. జ్యోతి(26) అనుమానాస్పద మృతి కేసులో Mystery వీడింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆమెను దారుణంగా murder చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం Kadapaలో డిఎస్పి వెంకటశివారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామం వనంవీధిలో నివాసముంటున్న రంగనాయకులు భార్య కె.జ్యోతి ఇటీవల Suspicious statusలో మృతి చెందింది.

ఆమె మరణంపై అనుమానం ఉందని అనంతపురం రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా, హత్యకేసుగా మార్చిన పోలీసులు కడప అర్భన్ సీఐ ఎస్ఎం ఆలీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ బృందం వివిధ కోణాలలో విచారించి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రామిరెడ్డి కాలనీకి చెందిన హమాలి బోయ నాగరాజుని నిందితుడిగా గుర్తించింది.

తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు ఈనెల 26న కొండపేట విఆర్ఓ సుధీర్కుమార్ వద్ద లొంగిపోయాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. జ్యోతి తన అత్తగారి ఊరైన బుక్కరాయసముద్రం మండలం వాడియంపేటకు వెళ్లి వచ్చే క్రమంలో నాగరాజుతో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అతను తరచూ కొండపేటలోని జ్యోతి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 17న మృతురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి గ్రామంలో తెలిస్తే తన సంసారం పాడవుతుందని, ఇకపై తన వద్దకు రావద్దని ఆమె చెప్పింది. ఇందుకు అంగీకరించని నాగరాజు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు దొంగిలించుకుని వెళ్ళాడు. నిందితుడి నుంచి పోలీసులు జత కమ్మలు, బంగారు పుస్తే, ఎనిమిది వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఏఎస్ఐ ఎం. జాకీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ ఐ. జగన్ నాయక్, కానిస్టేబుళ్లు కె. బాషా, కె. నాగరాజు, జి.రాజీవ్ కుమార్, డి.వి. భార్గవ్ లను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు.