ఆమెకు సోషల్ మీడియా పిచ్చి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా.. స్మార్ట్ ఫోన్ వదిలిపెట్టదు. కనీసం భర్త ఉన్నాడా, తిన్నాడా అన్న విషయం కూడా పట్టించుకోదు. దీంతో.. చాలా సార్లు భర్త ఆమెను మందలించాడు. అయినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. చివరకు ఓ రోజు భర్తకి అడ్డంగా దొరికేసింది. ఈ సంఘటన కేరళలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ లొని కొట్టాయంలో నివాసముంటోన్న కుమార్(పేరు మార్చాం) భార్య(సమత... పేరు మార్చాం) ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపేది. ఈ క్రమంలో భార్యను కుమార్ పలుమార్లు మందలించాడు కూడా. అయినా ఆమె పట్టించుకోలేదు. కాగా కుందన్ అనే వ్యక్తికి సమత శారీరకంగా దగ్గరైంది. రాత్రి వేళల్లో కుమార్ డ్యూటీకి వెళ్ళగానే నందన్ ఇంటికి వచ్చేవాడు.

ఇదే క్రమంలో... ఓ రోజు ఇద్దరూ కుమార్ కంటబడ్డారు. దీంతో తట్టుకోలేకపోయిన కుమార్... ఇరువురిపై దాడికి యత్నించాడు. దీంతో పెద్ద గొడవ జరగడంతో... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సమత, కుందన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.