మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరినీ అసభ్యకర రీతిలో ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ భార్య, భర్త వైపు వచ్చింది. ఆ భార్య, భర్తలు ఇద్దరు కలిసి మూడో మనిషిని చంపేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం ఒక ప్రాణాన్ని బలిగొంది. భార్య 63 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరిని అసభ్యకర రీతిలో భర్త చూశాడు. అంతే.. అనూహ్యంగా స్వల్ప వ్యవధిలోనే ఆ భార్య, భర్తలు ఒక్కటయ్యారు. ఇద్దరు కలిసి ఆ దుండగుడిని చంపేశారు. చనిపోయాక.. మృతుడి నుంచి విలువైన వస్తువులను లాక్కున్నారు. ఆ డెడ్ బాడీని దూరంగా పడేసి వచ్చారు. ఆయన సహజంగానే మరణించి ఉంటాడని, హత్య జరిగినట్టుగా అధికారులు తొలుత అనుమానించలేదు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఆయనను హత్య చేశారని ఆరోపణలు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది.
రేవా జిల్లా మౌహరియా గ్రామంలో ఓ మహిళ 63 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజు రాత్రి ఆమె భర్త శ్యామ్ లాల్ కోల్ ఆలస్యంగా రాత్రి పూట ఇంటికి వచ్చాడు. ఇంటిలో తన భార్య సునితా కోల్ కనిపించలేదు. భార్యను వెతుక్కుంటూ ఇంటి వెనుకాలే ఉన్న గార్డెన్‌లోకి వెళ్లాడు. అక్కడ ఆయన తన భార్య మరో వ్యక్తితో అసభ్యకర రీతిలో కనిపించింది. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
ఆ తర్వాత భార్య వెంటనే భర్త దగ్గరకు వచ్చింది. అనూహ్యంగా వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గర నుంచి విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత డెడ్ బాడీని దూరంగా పడేసి వచ్చారు.
ఈ హత్యలో భార్య, భర్త ఇద్దరూ పర్ఫెక్ట్‌గా కోఆపరేట్ చేసుకున్నారని, ఇద్దరూ సమన్వయంతోనే ఆ వ్యక్తిని అంతమొందించారని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఏఎస్పీ) శివ కుమార్ వర్మ తెలిపారు. ఆ మృతుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారం గొలుసు, నగదును వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
తాము ఇద్దరు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచామని, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నట్టు వివరించారు.
