Asianet News TeluguAsianet News Telugu

చెన్నైలో మానవ అవయవ అక్రమ వ్యాపారం రాకెట్‌.. ఆఫ్రికన్‌లతో సహా ఐదుగురి అరెస్ట్...

మానవ అవయవాల అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను విక్రయించడానికి ఏకంగా ప్రముఖ ఆసుపత్రి తరహాలో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారు కేటుగాళ్లు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

Human organ illegal trade racket in Chennai, Five people including Africans arrested - bsb
Author
First Published Sep 14, 2023, 7:21 AM IST

చెన్నై : మానవ అవయవాలను విక్రయించేందుకు నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించినందుకు గాను ఇద్దరు ఆఫ్రికన్ పౌరులతో సహా ఐదుగురిని చెన్నై పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. వెబ్‌సైట్ ప్రముఖ ఆసుపత్రి వెబ్ సైట్ లాగే ఉంది. ఈ వెబ్ సైట్ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడింది ఈ ముఠా.

చెన్నైకి చెందిన ఓ ఆసుపత్రి పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ నకిలీ వెబ్‌సైట్‌ మీద ఫిర్యాదు చేశారు. ఈ వెబ్ సైట్ లో మానవ అవయవాలకు సంబంధించిన ప్రకటనలను ఆయన తన ఫిర్యాదులో ఉటంకించారు. దీతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

ఫిర్యాదు ఆధారంగా, చెన్నై సౌత్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం.. నిందితుల మీద చీటింగ్ సహా ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరులో ఓ ముఠా నకిలీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు కేసు దర్యాప్తులో తేలింది.

విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోలను తీసిన దక్షిణ కొరియా లూనార్‌ ఆర్బిటర్‌

వారి గురించి గాలింపు చేపట్టిన పోలీసులు వారున్న ప్రదేశాన్ని గుర్తించి దాడి చేశారు. జెర్మియా, ఒలివియా, మోనికా, రామ్ బహదూర్ రియాంగ్, ఎరోమ్ జామ్సన్ సింగ్‌లుగా గుర్తించబడిన ఐదుగురు వ్యక్తులను ఈ దాడిలో పట్టుకున్నారు. జెర్మియా నైజీరియా పౌరుడు కాగా, ఒలివియా ఉగాండా పౌరుడు.

నిందితులు నేరం చేసేందుకు వినియోగించిన మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి మానవ అవయవాలను ఏర్పాటు చేయడానికి ఈ ముఠా రూ.5 కోట్ల వరకు ధర చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు, నకిలీ వెబ్‌సైట్‌ను నడపడంతో పాటు, నల్ల కాగితాలను డాలర్లుగా మార్చే రసాయనాలను విక్రయించడం, పోర్న్ వీడియో కాల్‌ల ద్వారా డబ్బు వసూలు చేయడం, వేశ్యలను ఆఫర్ చేస్తామనే నెపంతో మోసం చేయడం వంటి ఇతర నేరాలలో కూడా పాల్పడుతున్నారని తేలింది.

నిందితులు ఈ కార్యకలాపాలకు భారత్ లో నివసిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులను ఉపయోగించారు. ఇంకా, వారు సంభావ్య కస్టమర్‌లతో ఎలా మాట్లాడాలి. వారి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి అనే దానిపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను కూడా తయారు చేశారు. అరెస్టు అనంతరం ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios