కేరళలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ రైలు ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు కోజికోడ్ రేల్వేస్టేషన్ కు వచ్చారు. 

ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీల్లో ఆమె దగ్గర 117  జిలిటెన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు దొరికాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను కస్టడీలోకి తీసుకుని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

అయితే జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను బావులు తవ్వేందుకు తీసుకువెల్తున్నానని ఆ మహిళ చెప్పడం గమనార్హం. కానీ, పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. కేరళలో మరికొద్ది రోజుల్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపత్యంలో ఈ ఘటన రాష్గ్రంలో కలకలం రేపింది. 

గురువారం ముంబైలోనూ పేలుడు పదార్థాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిలిపారు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు యాంటిల్లా వద్ద భద్రతను పెంచారు.