అభినందన్ భారత్‌కు వచ్చే మార్గమిదే
పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీనిపై దేశప్రజలు, కేంద్రప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీనిపై దేశప్రజలు, కేంద్రప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు.
ఈ సంగతి పక్కనబెడితే... అభినందన్‌ను దాయాది దేశం భారత్‌కు ఎలా అప్పగించబోతోంది అన్న దానిపై ప్రస్తుతం దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో గగనతలాన్ని రెండు దేశాలు మూసివేశాయి.
అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు సైతం భారత్, పాక్ మీదుగా రాకుండా మరో దారిలో వెళ్తున్నాయి. లాహోర్ నుంచి భారత భూభాగంలోని అటారీ వరకు తీసుకెళ్దామన్నా లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రెండు దేశాలు రద్దు చేశాయి.
ఈ నేపథ్యంలో ఆయన్ను లాహోర్ లేదా కరాచీ నుంచి రోడ్డు మార్గంలో భారత్-పాక్ సరిహద్దు కేంద్రం వాఘా వద్ద పాక్ అధికారులు అభినందన్‌ను ... భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉంది.
రేపు మధ్యాహ్నం అభినందన్‌ను రీసివ్ చేసుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి గోఖలే లేక మరో ఉన్నతాధికారి వాఘా బోర్డర్‌కు వెళతారా అన్నది తెలియాల్సి ఉంది.
తలొగ్గిన పాక్..అభినందన్‌కు రేపు విముక్తి : ఇమ్రాన్ ప్రకటన
అభినందన్ గుండె ధైర్యాన్ని మెచ్చుకున్న పాక్ మీడియా