బీహార్‌ అసెంబ్లీలో జేడీయూ బలమెంత .. నితీష్‌ని లాలూ అంత తేలిగ్గా వదిలిపెడతారా..?

ఇండియా కూటమిలో వెలుగుచూసిన విభేదాలు .. బీహార్‌లో రాజకీయాలను వేడెక్కించాయి. కూటమిలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బీహార్ సీఎం , జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ పరిమాణాలతో ఆయన తిరిగి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరనుండటంతో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. 

how numbers stack up in bihar assembly as nitish kumar heads to nda ksp

ఇండియా కూటమిలో వెలుగుచూసిన విభేదాలు .. బీహార్‌లో రాజకీయాలను వేడెక్కించాయి. కూటమిలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బీహార్ సీఎం , జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ పరిమాణాలతో ఆయన తిరిగి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరనుండటంతో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పటికే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. కాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లు వున్నాయి..? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య జేడీయూకు వుందా లేదా అనేది చూస్తే :

బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 243 . ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 75 మంది , బీజేపీకి 74, జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేల బలం వుంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి వుండటంతో జేడీయూ ఒకసారి బీజేపీ మద్ధతుతో తర్వాత ఆర్జేడీ సపోర్ట్‌తో అధికారాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర, దేశ స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. సీఎం పదవి తన చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తూ చాణుక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం నితీష్ కుమార్. 

ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల మద్ధతుతో నితీష్ కుమార్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్జేడీ మంత్రుల స్థానంలో ఇప్పుడు బీజేపీ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎనిమిది మంది సభ్యుల బలం కావాలి.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రస్తుతం ఈ కూటమికి 114 మంది ఎమ్మెల్యేల బలం వుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. బీజేపీ, జేడీయూలకు చెందిన 10 మందిని ఈ పక్కకి లాగేందుకు లాలూ పావులు కదుపుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. 

బీహార్‌ అసెంబ్లీలో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే : ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 మొత్తం 125 మంది సభ్యుల బలం వుంది. ఇక మహాఘట్‌బంధన్ కూటమిని చూస్తే.. ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, సీపీఐ ఎంఎల్ 12, సీపీఐ 2, సీపీఎం 2 మొత్తం 110 సభ్యుల బలం వుంది. వీరు కాక ఎంఐఎం 5, బీఎస్పీ 1, ఎల్జేపీ 1, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మొత్తం 8 మంది ఇతరులు వున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios