అనంత్‌ అంబానీ పెళ్లి చేసిన పూజారి ఈయనే.. దక్షిణ ఎంతిచ్చారో తెలుసా?

Anant Ambani and Radhika Merchant's Wedding : కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుతో ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతుడైన ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి అనేక మంది ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌లో పాల్గొన్నారు. 
 

How Much Did Pandit Chandrashekhar Sharma Charge for Anant Ambani and Radhika Merchant's Wedding? RMA

Anant Ambani and Radhika Merchant's Wedding : ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడైన ముఖేష్-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘ‌నంగా శతాబ్దాల పాటు గుర్తుండిపోయే విధంగా జ‌రిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వైభ‌వంగా మాత్ర‌మే కాదు భార‌తీయ సాంప్రదాయాన్ని ఉట్టిప‌డేలా.. దైవత్వం క‌నిపించేలా జ‌రిగింది. దేశ‌విదేశాల నుంచి అనేక మంది ప్ర‌ముఖులు ఈ వివాహ వేడ‌క‌లో భాగ‌మ‌య్యారు. పెళ్లిలో సనాతన సంస్కృతిని భారతదేశమే కాదు, యావ‌త్ ప్రపంచం మొత్తం చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ఈ వివాహ వేడుక‌ల కోసం కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసిన అంబానీ కుటుంబం.. వ‌చ్చిన అతిథుల‌కు అంతే స్థాయిలో బ‌హుమ‌త‌లు అందించింది. 

భార‌తీయ ఆచారాలు, సంస్కృతి ఉట్టిప‌డేలా వివాహం జ‌రిపించిన పూజారి గురించి హాట్ టాపిక్ న‌డుస్తోంది. అంబానీ వివాహం జ‌రిపించిన పండితుడు ఎవ‌రు? అయ‌న‌కు ఎంద ద‌క్షిణ స‌మ‌ర్పించుకుని ఉంటార‌నే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అయితే, అనంత్ అంబానీ వివాహం జ‌రిపించిన పండితుడి వివ‌రాలు గ‌మ‌నిస్తే.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు, పూజారి, పర్సనల్‌ కోచ్‌, లైఫ్‌స్టైల్‌ మోటివేటర్ గా ఉన్న పండిట్‌ చంద్రశేఖర్‌ శర్మ అనంత్ అంబాన్ని వివాహాన్ని జ‌రిపించారు. ఈ పవిత్ర క్రతువును ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించిన చంద్రశేఖర్‌ శర్మ చేతుల మీదుగానే అంబానీ కుటుంబంలో పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు జ‌రుగుతాయి. గుజరాత్‌ జామ​ నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక‌ల్లో కూడాచ చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ ఉన్నారు. 

అంబానీ కుటుంబానికి సంబంధించిన హై-ప్రొఫైల్ ఈవెంట్‌లను నిర్వహించే పండిట్ చంద్రశేఖర శర్మకు ఈ కుబేరుని కుటుంబం విమానాశ్రయంలో స్వాగతం పల‌క‌డం గ‌తంలో వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆంటిలియాలో గణేష్ చతుర్థి ఉత్సవాలతో సహా తన ఫేస్‌బుక్ పేజీలో అంబానీ కుటుంబంలో జ‌రిపించిన‌ వేడుకల ఫోటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంటారు. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియాన్స్ టీమ్ తో క‌లిసి క‌నిపించారు. ఈ ఫొటోలో నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఆకాష్ అంబానీలు కూడా ఉన్నారు. సాధార‌ణంగా పండిట్ చంద్ర‌శేఖ‌ర‌ శర్మ వివాహ ఆచారాలను నిర్వహించడానికి రూ. 25,000 వసూలు చేస్తారు. ఇందులో దానికి అవసరమైన సామగ్రి కూడా ఉంటుంది. అయితే, అనంత్ అంబానీ వివాహ వేడుక‌ల కోసం ఆయ‌న‌కు అంబానీ కుటుంబం ల‌క్ష‌ల్లోనే ద‌క్షిణ స‌మ‌ర్పించుకుంద‌ని స‌మాచారం. అదనంగా  ఆయనకు విలాసవంతమైన వసతులు కల్పించడంతో పాటు ఖరీదైన బహుమతులు అందించారని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios