ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకరి పేరే వినపడుతోంది. ఆయనే అభినందన్. పాకిస్థాన్ చెరలో ఉన్న వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా స్వదేశానికి చేరాలని.. దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. అయితే.. అభినందన్ ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ఒకే ఒక్క మార్గం.. జెనీవా ఒప్పందం.

యుద్ధ సమయంలో పట్టుబడిన సైనికులు, పౌరులందరినీ  యుద్ధ ఖైదీలు అంటారు. యుద్ధ క్షేత్రంలో గాయపడి పట్టుబడిన వీరికి ఎలాంటి రక్షణ కల్పించాలి? ఎలాంటి హక్కులు ఉంటాయనేది ఈ జెనీవా ఒప్పందంలో స్పష్టంగా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1949లో కుదిరిన ఈ ఒప్పందాల మీద దాదాపు 196 దేశాలు సంతకాలు చేసాయి. 

ఆ ఒప్పందం ప్రకారం.. గాయపడిన, నిలకడగా లేని సైనికులకు రక్షణనిచ్చే ఒప్పదం ఇది. దీని ప్రకారం జాతి, మత, లింగ, ప్రాంత వివక్షలకు తావులేకుండా ఆ సైనికులను ఎవరైనా సరే వారికి మానవతా దృక్పథంతో సాయం చేయాలి. వారిని హింసించడం, దాడి చేయడం లాంటివి చేయకూడదు. వారికి పూర్తిగా వైద్య సదుపాయం కూడా అందించాలి. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ అవలంభిస్తే.. అభినందన్ క్షేమంగా స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.