ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు అడ్డుగా ఉంటున్నాడనే కారణంతో కన్న కుమారుడినే చంపేసింది ఓ తల్లి. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఆ మహిళకు కొన్నేళ్ల క్రితం పెద్దలు ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ బంధం తరువాత వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారి అనుబంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇద్దరు కుమారులతో లైఫ్ చాలా సాఫీగా సాగిపోతోంది. అయితే కొంత కాలం తరువాత భార్య, భర్తలకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. గొడవలు కూడా జరిగాయి. దీంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటను కలిపి ఉంచాలని పెద్దలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అవేవీ ఫలితాలను ఇవ్వలేదు. దీంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలు ఉండటంతో వారిని చెరొకరు ఉంచుకున్నారు. ఒక కుమారుడు తండ్రి వద్ద, మరో కుమారుడు తల్లి వద్దకు వెళ్లిపోయారు. అయితే తల్లి వద్ద ఉన్న కుమారుడు ఒక్క సారిగా చనిపోయాడు. ఎలా చనిపోయాడో డాక్టర్లు కూడా నిర్ధారించారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎంక్వేరీ చేయడంతో అసలు విషయం బయటపడింది. నాలుగో ప్రియుడితో గడిపేందుకు వారిద్దరూ కలిసి పిల్లాడిని చంపేశాడని తెలిసింది. దీంతో ఒక్క సారిగా అందరూ షాక్ కు గురయ్యారు.
ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు కన్న కొడుకునే అడ్డు తొలగించుకున్న దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పర్యాటక ప్రదేశమైన ఊటీ సమీపంలో వాషర్ మెన్ పేట్‌కు చెందిన వ్యక్తి ఉంటున్నారు. ఆయన పేరు కార్తీక్. అతడికి గీత అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరు ఎంతో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిలో ఒకరి పేరు నితీశ్ కాగా.. మరొకరి పేరు నితిన్. అయితే ఆ జంట మధ్య కొంత కాలం తరువాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో గొడవలు జరిగాయి. ఇద్దరు విడి విడిగా ఉండాలనే ఆలోచనకు వచ్చారు. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. వీరిని కలిపి ఉంచేందుకు ఇరు పక్షాల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే వీరు విడిపోవాలనే నిర్ణయించుకోవడంతో పెద్దల మాట కూడా ఎలాంటి ఫలితం చూపలేదు. కొన్ని పంచాయితీల తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
పిల్లలను చెరొకరి వద్ద ఉంచుకోవాలని అనుకున్నారు. ఒక కుమారుడు నితీష్ ను భర్త, మరో కుమారుడు నితిన్ ను భార్య తీసుకున్నారు. అయితే తండ్రి వద్ద ఉన్న కుమారుడు బాగానే ఉన్నా.. తల్లి వద్ద ఉన్న కుమారుడు మాత్రం ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కిందపడిపోయాడు. తల్లి ఆందోళన చెందుతూ, కన్నీరు మున్నీరవుతూ హాస్పిటల్ కు పరుగు తీసింది. తన కుమారుడిని కాపాడాలని డాక్టర్లను వేడుకుంది. అయితే అప్పటికే ఆ పిల్లాడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కానీ ఆ పిల్లాడు చనిపోవడానికి కారణం ఏంటని మాత్రం డాక్టర్లు తెలుసుకోలేకపోయారు. పోస్టుమార్టంలో కూడా వారికి ఎలాంటి సమాచారం దొరుకలేదు.
నితిన్ మృతి అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దీంతో వారికి నమ్మలేని నిజాలు తెలిశాయి. గీతకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పాటు కార్తీక్ తో వివాహం జరగడానికి ముందే గీతకు ఇద్దరిని పెళ్లి చేసుందని, వారితో విడాకులు అయ్యాయని గుర్తించారు. నాలుగో ప్రియుడితో గడిపేందుకే భర్తతో విడిపోయినట్టు తెలిపారు. పిల్లాడు తమకు అడ్డుగా ఉంటున్నాడనే కారణంతో నితిన్ కు మద్యం తాగించారని చెప్పారు. అనంతరం బాగా ఫుడ్ పెట్టి తినిపించారని పేర్కొన్నారు. అనంతరం పాలు తాగించి మర్డర్ చేశారని పోలీసులు తెలిపారు. గీతను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
