ఓ సాధారణ వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో మనందరికి తెలుసు... మరి అదే సంసార జీవితానికి దూరంగా బ్రతుకుతున్న ఓ సన్యాసి చనిపోతే ఎలా నిర్వహిస్తారు?   

సాధువుల గురించి ఆసక్తికర విషయాలు : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాను పరిశీలిస్తే సాధువుల ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. వారికి ప్రత్యేక ఆచారాలు ఉంటాయి. శైవ అఖాడాలలో సాధువు మరణిస్తే ఎన్ని రోజుల తర్వాత, ఎలా అంత్యక్రియలు చేస్తారో చాలా తక్కువ మందికి తెలుసు. శైవ అఖాడాలకు చెందిన సాధువు మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకుందాం...

సాధువులను దహనం చేస్తారా లేక సమాధి చేస్తారా?

శైవ అఖాడాలలో సన్యాసి మరణిస్తే అతన్ని దహనం చేయరు... సమాధి చేస్తారు. అంటే భూమిలో పాతిపెడతారు. ఈ సమయంలో మృతుడు కూర్చున్న భంగిమలో ఉంటాడు. సమాధి చేసే ముందు శవాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీన్ని డోలీ అంటారు.

ఎన్ని రోజులకు కార్యక్రమాలు చేస్తారు?

సాధారణంగా వ్యక్తి మరణిస్తే 13 రోజుల్లోనే చివరి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తారు. కానీ శైవ అఖాడాలలో 16 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. 16వ రోజు జరిగే ముఖ్య కార్యక్రమాన్ని షోడశి అంటారు. సన్యాసులకు సమాధి నుండి షోడశి వరకు కార్యక్రమాలు నిర్వహించడానికి గోదడ్ అఖాడా అనే ప్రత్యేక అఖాడా ఉంది. దేశంలో ఎక్కడైనా సన్యాసి మరణిస్తే, 16 రోజుల కార్యక్రమాలకు ఈ అఖాడ సభ్యుల హాజరు తప్పనిసరి.

16 రోజులు రోజూ భోగం పెడతారు

గోదడ్ అఖాడ సాధువులు మృతుని సమాధి వద్ద 16 రోజులు రోజూ భోగం పెడతారు. ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16 రోజుల తర్వాత మిగిలిన కార్యక్రమాలను మృతుని శిష్యులు పూర్తి చేస్తారు. 16వ రోజు షోడశి తర్వాత భండారా ఏర్పాటు చేస్తారు. దీంతో అంత్యక్రియలు పూర్తవుతాయి.

Disclaimer
ఈ వ్యాసంలోని సమాచారం జ్యోతిష్యులు అందించినది. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే మాధ్యమం మాత్రమే. ఈ సమాచారాన్ని కేవలం సమాచారంగానే పరిగణించండి.