దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వారం రోజుల క్రితం చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికా రాయబారి కార్యాలయంలో హోస్ కీపింగ్ స్టాఫ్ కుమార్తెపై అక్కడ పనిచేసే కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక వయసు ఐదు సంవత్సరాలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక ద్వారా నిజం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read అత్తింటి దుర్మార్గం: మంచానికి కట్టేసి.. నిప్పు, చావు బతుకుల్లో కోడలు..

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోస్కో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు. కాగా.. దీనిపై అమెరికా రాయబారి కార్యాలయ అధికారులు స్పందించారు. ఆ డ్రైవర్ తమ ఉద్యోగి కాదని చెప్పారు. ఈ ఘటనపై తాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయం తమ వద్దకు రాగానే తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసుల దృష్టికి వెళ్లామని.. ఈ కేసు విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.