ట్విస్ట్:పెళ్ళికి ముందే వధువు జంప్, మరో యువతితో వరుడికి మ్యారేజీ

hours before  marriage bride  missing in   Tamilnadu
Highlights

పెళ్ళికి ముందే షాకిచ్చిన వధువు

చెన్నై:  పెళ్ళికి కొన్ని గంటల ముందే పెళ్ళి కూతురు అదృశ్యమైంది. అనుకొన్న ముహుర్తానికే వివాహం జరిపించాలనే ఉద్దేశ్యంతో వివాహనికి వచ్చిన బంధువుల అమ్మాయితో ఆ యువకుడికి వివాహం జరిపించారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.


తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రుట్టికి చెందిన అళగేశన్‌ పూల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతడికి సోమకోటకు చెందిన రంజింతంతో పెళ్ళి కుదిరింది.జూన్ 4 వతేదిన వీరిద్దరికి వివాహం జరగాల్సి ఉంది. అయితే  వివాహ సమయం సమీపిస్తున్న సమయంలోనే వధూవరులిద్దరూ కూడ ఫంక్షన్ హల్ కు చేరుకొన్నారు. ముహుర్తసమయానికి వధువుకన్పించకుండా పోయిందిఆమె కోసం కుటుంబసభ్యులు గాలించినా ప్రయోజనం లేకుండాపోయింది.


పోలీసులకు కూడ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పెళ్ళి కోసం వచ్చిన బంధువులు ఓ నిర్ణయానికి వచ్చారు. వివాహం చూసేందుకు వచ్చిన బంధువుల్లో ఓ అమ్మాయితో వరుడికి వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులను  ఒప్పించి అదే ముహుర్తానికి    ఆళగేశన్ కు వివాహం జరిపించారు.


పెళ్ళి సమయానికి వధువు ఎందుకు కన్పించకుండా పోయిందనే విషయమై కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు. పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయిందా, లేక ప్రేమించి వ్యక్తితో వెళ్ళిపోయిందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader