Hotel Service Charge: హోటల్, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు చెల్లించడంలో కస్టమర్లకు భారీ షాక్ తగిలింది. ఈ విషయంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
Hotel Service Charge: హోటల్, రెస్టారెంట్లలో విధించిందే సర్వీస్ ఛార్జీల విషయం మరోసారి చర్చనీయం అవుతోంది. సర్వీస్ ఛార్జీ వసూలు విషయంలో (జూలై 4న) సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)కి ఫిర్యాదుల అందటంతో ప్రభుత్వం నూతన మార్గదర్శక దేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ ఆర్డర్స్ ప్రకారం.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల వసూలును నిషేధం.
అయితే.. ఈ మార్గదర్శకాలపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. హైకోర్టులో సవాలు చేశాయి. ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.
నేడు CCPA నూతన మార్గదర్శకాలను సవాలు చేస్తూ.. NRAI, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేశాయి. CCPA నూతన మార్గదర్శకాలు ఏకపక్షం అని, ఆ ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదని, వాస్తవాలు, పరిస్థితులను గుర్తించకుండా జారీ చేసిన ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరాయి.
ఈ పిటిషన్ ను జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారించింది. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు ఆటోమెటిక్‌గా సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదంటూ ఇచ్చిన గైడ్‌లైన్స్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
వాస్తవానికి జూలై 4న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ ఛార్జీని జోడించకూడదు. అయితే వినియోగదారుడు కోరుకుంటే, వారి కోరిక మేరకు సర్వీస్ ఛార్జీని చెల్లించవచ్చు.
విచారణ సమయంలో.. సర్వీస్ ఛార్జీలపై హైకోర్టు రెండు షరతులు పెట్టింది. కస్టమర్లు సర్వీస్ ఛార్జీ చెల్లించాలని, మెనూతో పాటు హోటల్‌లో సర్వీస్ ఛార్జీ గురించి వినియోగదారునికి తెలిసిలే ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
అలాగే.. టేక్ అవే ఐటమ్స్‌కు సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదని తెలిపింది. కస్టమర్లు సర్వీస్ ఛార్జీ చెల్లించకూడదనుకుంటే.. రెస్టారెంట్ లోపలికి రాకూడదని, అది వారి ఛాయిస్‌కు సంబంధించిన అంశమని కోర్టు అభిప్రాయపడింది. ఈ రెండు కండీషన్లతో కూడిన మార్గదర్శకాలలోని పారా 7 పై స్టే విధిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ నవంబర్ 25న జరగనుంది.
సర్వీస్ ఛార్జ్ గురించి నియమాలు ఏమి చెబుతున్నాయంటే.. !
రెస్టారెంట్లు, హోటళ్లు సాధారణంగా ఆహార బిల్లుపై 10 శాతం సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తాయి. ఒక వినియోగదారుడు హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్నట్లు గుర్తిస్తే.. బిల్లు మొత్తం నుండి దానిని తీసివేయమని సంబంధిత సంస్థను అభ్యర్థించవచ్చు. కస్టమర్లు అవసరమైతే.. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) నంబర్ 1915కి కాల్ చేయడం ద్వారా లేదా NCH మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
