బిర్యాని కోసం గొడవ, హోటల్ యజమానిని కాల్చి చంపిన దుండగులు

Hotel owner shot dead over plate of biryani in West Bengal
Highlights

పశ్చిమ బెంగాల్ లో దారుణం

వారంతా పేరు మోసి రౌడీలు. ఓ హోటల్ లో బోజనం చేయడానికి వెళ్లారు. అక్కడ పుల్లుగా బిర్యాని తిని బిల్ కట్టకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో హోటల్ యజమాని గమనించి బిల్ కట్టాలని నిలదీయగా కోపోద్రిక్తులైన రౌడీ గ్యాంగ్ అతన్ని గన్ తో కాల్చి చంపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. నార్త్ 24పరగణాస్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న సంజయ్ కుమార్ ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం  రాజా, ఫిరోజ్‌, మోగ్రి, సల్మాన్‌ అనే నలుగురు రౌడీలు భోజనం చేయడానికి ఈ హోటల్ కి వచ్చారు. వారు పుల్లుగా బిర్యాని తిని బిల్లు కట్టకుండా వెలుతుండగా వారిని సంజయ్ అడ్డుకుని బిల్లుకట్టమన్నాడు. దీంతో ''మమ్మల్నే బిల్లు కట్టమంటావా'' అంటూ అందులోని ఓ వ్యక్తి గన్ తీసి సంజయ్ ని కాల్చాడు.

తీవ్రంగా గాయపడిన సంజయ్ ని అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.    

ఈ ఘటనపై సంజయ్ సోదరుడు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఫిరోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.  మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇప్పటికైతే బిర్యానీ ధరపై వాగ్వాదం తలెత్తినట్లు భావిస్తున్నామని, ఇతర కారణాలేమైనా ఉన్నాయనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి ఈ హత్యకు గల కారణాలను తెలుసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.  
 

loader