న్యూఢిల్లీ: ఓ నర్సుకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అతి పెద్ద ఆస్పత్రి ఒకటి మూతపడింంది. గత రెండు వారాలుగు నర్సు హిందూ రావు ఆస్పత్రిలోని వివిధ సెక్షన్లలో పనిచేస్తూ వచ్చింది. ఆమె కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది.

నార్త్ ఢిల్లీలో హిందూరావు ఆస్పత్రి అతి పెద్దది. పూర్తిగా శానిటైజ్ చేసే వరకు ఆస్పత్రిని తెరవకూడదని అధికార యంత్రాంగం నిర్ణయించింది. నర్సుతో కాంటాక్టులో వచ్చినవారందరినీ గుర్తించారు. శనివారం సాయంత్రం హిందూరావు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

ఆమెతో కాంటాక్టులోకి వచ్ిచన కొద్ది మందిని గైనకాలజీలో వార్డులో చేర్చి అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఏదో ఒక స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ స్థితి వచ్చిందని, దానిపై విచారణ జరిపిస్తామని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ వర్ష జోషి అన్నారు.

కరోనా వైరస్ అనుమానితులను ఎలా గుర్తించాలి, వారిని ఏ విధంగా క్వారంటైన్ కు తరలించాలి అనే విషయాలపై కార్పోరేషన్ కొన్ని నియమనిబంధనలను జారీ చేసింది. 

ఢిల్లీలో 2,625 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి కరోనా వైరస్ తో 54 మంది మరమించారు. నలుగురు కరోనా రోగులకు నిర్వహించిన ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.