దేశ రాజధాని ఢిల్లీలో రద్దీగా ఉండే రోడ్లపై గుర్రపు బండ్లతో పందెం నిర్వహించారు. గుర్రపు బండ్లు రోడ్డుపై వెళ్లుతుండగా టూ వీలర్లపై వారు వెళ్లుతూ కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: అది రేస్ ట్రాక్ కాదు. మారుమూల ప్రాంతం అసలే కాదు. దేశ రాజధాని.. రద్దీగా ఉండే రోడ్డుపై గుర్రపు బండ్లతో పందెం నిర్వహించారు. ఆ బండ్లకు వెనుకా ముందు టూ వీలర్ లపై కేకలు పెడుతూ ప్రయాణించారు. ఆ బండ్లను మరింత వేగంగా తోలాలని టోంగావాలాలను హుషారు పెట్టారు. ఇదంతా వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పది మందిని అరెస్టు కూడా చేశారు. జంతువులను హింసిచే చట్టాల కిందా వారిపై అభియోగాలు మోపారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని షాపింగ్ ఎక్కువగా జరిగే కమలా మార్కెట్ దగ్గర చోటుచేసుకుంది.
Also Read: పెళ్లికి ముందు మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్టులు.. వివాదంలో మధ్యప్రదేశ్ వివాహ పథకం
అరెస్టు చేసిన వారు రోడ్లపై న్యూసెన్స్ చేశారని, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి వారిని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
పోలీసులు నాలుగు గుర్రాలను, మూడు టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు.
