దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కాటికి కాళ్లు చాపుకొని.. చావు కోసం ఎదురుచూస్తున్న ఓ 90ఏళ్ల బామ్మపై కామాంధుల కన్నుపడింది. పెద్దావిడ అనే కనికరం కూడా లేకుండా.. దారుణానికి పాల్పడ్డారు. ఆ బామ్మపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. దాడి కూడా చేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ మహిళా కమిషన్ పేర్కొంది. కాగా.. ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం చోటుచేసుకుంది. నిందితుడు రెవ్లా కాన్పూర్ కి చెందిన సోను(33) గా గుర్తించారు.

నిందితుడు బామ్మను బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ పేర్కొన్నారు. సదరు బామ్మ తీవ్రంగా గాయపడ్డారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. నిందితుడు బామ్మపై దాడి చేసే క్రమంలో చాలా ప్రాదేయపడిందట. నీకు అమ్మమ్మ లాంటిదాన్ని వదిలేయమని వేడుకున్నా.. కనికరం చూపకపోవడం గమనార్హం. తనపై జరిగిన దాడిని చెప్పే క్రమంలో.. సదరు బామ్మ కన్నీరు పెట్టుకుందని అధికారులు చెబుతున్నారు.