Asianet News TeluguAsianet News Telugu

కల్తీ మద్యం తాగి.. 17మంది మృతి

కల్తీ మద్యం తాగి 17మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది.

Hooch Tragedy: Spurious liquor claims 17 lives in Assam's Golaghat district
Author
Hyderabad, First Published Feb 22, 2019, 3:37 PM IST

కల్తీ మద్యం తాగి 17మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది. టీ తోటల్లో పనిచేసే కొందరు కూలీలు ఓ వేడుకలో పాల్గొని.. అక్కడ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... గోలాఘాట్ లోని  సల్మారా టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. వేడుకలో భాగంగా మద్యం తెచ్చుకొని తాగారు. మద్యం తాగిన కాసేపటికే నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 13కి చేరింది. 

వారు తాగిన మద్యంలో విషం కలిసిందని.. అందుకే చనిపోయారని వైద్యులు నిర్దారించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 30 మందికి పైగా వేడుకలో పాల్గొని విషపూరిత మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మద్యాన్ని రసాయనాల క్యాన్‌లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ మద్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios