ఒడిశా: పరువు పోయిందని క్షణికావేశంలో కన్న తండ్రే కూతురి గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని గుండూరిబాడి గ్రామానికి చెందిన 17ఏళ్ళ యువతి గతనెల 25వ తారీఖునుంచి కనపడకుండా పోయింది. 

సెప్టెంబర్ 15వ తేదీన ఈ అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చింది. వేరే అబ్బాయితో లేచిపోయిందని భావించిన తండ్రి అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు. దానితో పక్క ఊరిలోని మనమామ ఇంటికి వెళ్ళింది. 

తరువాతిరోజు తండ్రి కూడా పక్క ఊరికి వెళ్ళాడు. మేనమామ, తండ్రి కలిసి ఎంత ప్రశ్నించినా అబ్బాయి పేరు చెప్పలేదు. ఎంతకూ చెప్పకపోవడంతి ఇక చేసేదేమీ లేక కూతురిని తీసుకొని తండ్రి స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఈ విషయమై మరోమారు తండ్రీ కూతుర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కూతురి గొంతునులిమి చంపేశాడు. 

శవాన్ని పక్కనే ఉన్న పొదల్లో విసిరేసి తాను ఇంటికెళ్ళాడు. 19వ తేదీనాడు ఈ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు విచారణ చేపట్టినప్పటినుంచి తండ్రిపై అనుమానపడుతున్న పోలీసులు అతనిని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.