బెంగళూరులో పెద్దల పరువుకు ప్రేమజంట బలైపోయింది.  ప్రేమించుకోవడమే వారు చేసిన నేరం.. ఇది భరించలేని యువతి తండ్రి, బంధువులు చెట్టుకు కట్టి తీవ్రంగా హించించి, చాకుతో పొడిచి, ఆ తర్వాత బండరాళ్లతో తలపమీద కొట్టి హత్య చేశారు. 


బెంగళూరులో పెద్దల పరువుకు ప్రేమజంట బలైపోయింది. ప్రేమించుకోవడమే వారు చేసిన నేరం.. ఇది భరించలేని యువతి తండ్రి, బంధువులు చెట్టుకు కట్టి తీవ్రంగా హించించి, చాకుతో పొడిచి, ఆ తర్వాత బండరాళ్లతో తలపమీద కొట్టి హత్య చేశారు. 

యువకుని తల్లి అలా చేయవ్దని కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. ఆమె కళ్లముందే ప్రేమించిన యువతితో సహా కొడుకు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో జరిగిన ఈ దారుణాన్ని యువకుడి తల్ి బుధవారం మీడియాకు వివరించింది. వివరాల ప్రకారం..

దేవరహిప్పరగి తాలూకా సలాదహళ్లికి చెందిన బసవరాజ బడిగేర (19), దావలభి బందగిసాబ్ తంబద్ (18) కొంతకాలంగా ప్రేమించుంటున్నారు. వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వీరి ప్రేమను యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. మంగళవారం సలాదహళ్లి గ్రామ శివారుకు ఇద్దరినీ తీసుకెళ్లారు. 

ఐసీయూలో ఎలుక కొరికిన రోగి మృతి...

విషయం తెలుసుకున్న బసవరాజ తల్లి మల్లమ్మ, సోదరుడు కల్యాణకుమార్ అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇద్దరినీ చెట్టుకు కట్టేసి దావలభి తండ్రి బందగిసాబ్, సోదరుడు దావల్ పటేల్, అల్లుడు లాతాసాబ్ తో పాటు అల్లాపటేల్ రఫీక్ చిత్రహింసలకు గురి చేశారు. హింసించవద్దని బసవరాజ తల్లి వేడుకున్నారు.

అయినా కనికరించలేదు. ఆమె చూస్తుండగానే యువతి తండ్రి చాకుతో ప్రేమికులిద్దరినీ పొడిచాడు. ఆ తర్వాత బండరాళ్లతో తలను ఛిద్రమయ్యేలా కొట్టారు. దీంతో ఇద్దరూ మృతి చెందారు. యువతి తండ్రి, సోదరుడు, అల్లుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదుగురిమీద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.