తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పరువు హత్యలు కలకలం రేపాయి. కొడుకు వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పరువు హత్యలు కలకలం రేపాయి. కొడుకు వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డారు. తన తల్లి, కొడుకు, కోడలుపై దాడి చేశాడు. ఈ దాడిలో అతడి తల్లి, కొడుకు మరణించారు. కోడలు తీవ్రంగా గాయపడి ఆస్ప్రతిలో చికిత్స పొందుతుంది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా అరుణపతి గ్రామంలో దండపాణి(50) అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది. అతడి కుమారుడు సుభాష్ (26) తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ తనతో పాటు పనిచేసే అరియలూరు జిల్లకు చెందిన అనసూయ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది.
ఇద్దరూ వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో సుభాష్ తండ్రి దండపాణి వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో వీరు గత నెల 27న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే సుభాష్ తన భార్యను తీసుకొచ్చి నిన్న స్వగ్రామానికి వచ్చాడు. దండపాణి తల్లి కన్నమ్మ వారికి ఆశ్రయం కల్పించింది. ఈ విషయం తెలుసుకున్న దండపాణి ఆవేశంతో తల్లి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకుని కొడవలి తీసుకుని సుభాష్ దంపతులతో పాటు, కన్నమ్మపై దాడి చేశాడు. ఈ ఘటనలో సుభాష్, కనమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దండపాణి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇక, దండపాణి దాడిలో తీవ్రంగా గాయపడిన సుభాష్ భర్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే సుభాష్, కన్నమ్మలు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న తండపాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
