స్వలింగ సంపర్కం...ప్రియురాలిపై యాసిడ్ దాడి.

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 27, Aug 2018, 1:19 PM IST
Homo sexual affair: Acid attack on gir
Highlights

స్వలింగ సంపర్కం ఓ బాలిక ప్రాణాల మీదకి తెచ్చింది. తనతో సంబంధం కొనసాగించడానికి నిరాకరించిన బాలికపై ఆగ్రహానికి గురైన ఓ యువతి హత్యాయత్నం చేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది.

లక్నో: స్వలింగ సంపర్కం ఓ బాలిక ప్రాణాల మీదకి తెచ్చింది. తనతో సంబంధం కొనసాగించడానికి నిరాకరించిన బాలికపై ఆగ్రహానికి గురైన ఓ యువతి హత్యాయత్నం చేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది.

 

వివరాల్లోకి వెళ్తే దక్షిన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలసి ఉంటోంది.  ఆ బాలికకు మరో యువతితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ఇద్దరి మధ్య లైంగిక సంబంధానికి దారితీసింది. అయితే గతకొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని యువతి బాలికపై ఒత్తిడి తెస్తోంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తనను కాదంటున్న బాలికను అంతమెందించాలని యువతి ప్లాన్ చేసింది. నాలుగు నెలలుగా అవకాశం కోసం ఎదురుచూసింది. 

 

అయితే బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆ యువతి ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి పరారైంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కేసు నమోదు చేసిన పోలీసులు ఆయువతిని ఆరా తియ్యగా పోలీసులకు సినిమా స్టోరీ చెప్పింది. బాలిక మిత్రుడు విమల్‌ యాసిడ్ దాడికి పాల్పడ్డాడని ఆ నేరం అతనిపై  మోపేందుకు యత్నించింది. చేతులపై యాసిడ్‌ పోసుకుని తాను కూడా విమల్‌ దాడిలో గాయపడినట్లు అందర్నీ నమ్మించింది. బాలిక తల్లిదండ్రులకు సైతం అనుమానం కలిగేలా నటించింది.

గతంలో తమ కూతురుతో విమల్‌ గొడవ పడ్డాడని ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే యువతి సమాధానంపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి, యువతికి మధ్య లైంగిక సంబంధం ఉందని విచారణలో వెల్లడైంది.

 

బాలికపై యాసిడ్ దాడికి పాల్పడింది తానేనని యువతి నేరం అంగీకరించింది.  దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖం, ఛాతిపై తీవ్ర గాయాలవ్వడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

loader