Coronavirus: విదేశీ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు.. ప్రయాణికులకు క‌రోనా కొత్త మార్గదర్శకాలు!

Coronavirus: భార‌త్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్నది. కోవిడ్ కొత్త వేరియంట్ ఉధృతి కార‌ణంగా రోజువారీ కొత్త కేసులు ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ఇక విదేశాల నుంచి వ‌స్తున్న వారిలో స‌గం మందికి పైగా క‌రోనా సోకిన వారు ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన కేంద్రం.. ప్రయాణాల‌కు సంబంధించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. 
 

Home quarantine mandatory for all international arrivals in india from today amid covid 19 and omicron variant

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం మొద‌లైంది. చాలా దేశాల్లో ఆందోళ‌న‌క‌ర స్థాయిలో Coronavirus కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. చాలా దేశాల్లో రోజువారీ కేసులు ల‌క్ష‌ల్లో న‌మోదుకావ‌డం వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో క‌రోనా మహ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ప‌రిస్థితులు దిగ‌జారాయి. ఇక భార‌త్ లోనూ Covid-19 మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం మొద‌లైంది. ల‌క్షల్లో రోజువారీ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వారిలో క‌రోనా సోకిన వారు అధికంగా ఉంటున్నారు. మొద‌ట్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు విదేశాల నుంచి వ‌చ్చిన వారిలోనే వెలుగుచూశాయి. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కేసులు ఉధృతి పెరుగుతుండ‌టంతో.. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ నూత‌న క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ  వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ క్వారంటైన్ స‌మ‌యం ముగిసిన ఎనిమిద‌వ రోజు విదేశాల నుంచి వ‌చ్చిన‌వారంద‌రికీ మ‌రోసారి ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు. Coronavirus ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ వ‌స్తేనే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవ‌స‌రం లేదు. 

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్రయాణికుల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు మంగ‌ళ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.  అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సవరించిన క‌రోనా వైర‌స్ మార్గదర్శకాలను  కేంద్రఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  విడుద‌ల చేసింది. గ‌తేడాది నవంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన Coronavirus కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అధికంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కేసులు పెర‌గ‌కుండా నియంత్రించే చ‌ర్య‌ల్లో భాగంగానే కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు సంబందించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు తీసుకువ‌చ్చింద‌ని మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. Covid-19 తీవ్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చిన వారిని వెంటనే బయటకు వెళ్లనీయకూడదని పేర్కొంది. వీరు వ‌చ్చిన వెంట‌నే బ‌య‌ట ఎక్కువ‌గా సంచరించకూడదని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  విదేశాల నుంచి వ‌చ్చిన వారు ముందుగా హోం క్వారంటైన్ లో ఏడు రోజుల పాటు త‌ప్ప‌ని స‌రిగా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఎనిమిది రోజుల తర్వాత, RT PCR పరీక్షలు త‌ప్ప‌కుండా చేయించుకోవాల‌ని సూచించింది. 

అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల కోసం కేంద్ర విడుద‌ల చేసిన కొత్త Corona మార్గ‌ద‌ర్శ‌కాల్లో మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి... ప్రయాణీకులందరూ ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ గురించి పూర్తి, సరైన సమాచారాన్ని అందించాలని పేర్కొంది. ప్రయాణ తేదీకి 14 రోజుల ముందు వరకు చేసిన ఇతర ప్రయాణాల వివరాలను కూడా త‌ప్ప‌కుండా అందివ్వాల‌ని తాజా మ‌ర్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. ప్రయాణీకులు Covid-19 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను సైతం అందించాల‌ని తెలిపింది. ఈ పరీక్ష ప్రయాణ తేదీకి గరిష్టంగా 72 గంటల ముందు ఉండాలి. పరీక్ష నివేదిక విశ్వసనీయతకు సంబంధించిన అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణీకుడు క్వారంటైన్, హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించిన అన్ని నియమాలను పాటిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల‌ని ప్ర‌స్తుత మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. విదేశీ ప్ర‌యాణాలు చేసిన వారు కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ.. వారం రోజుల పాటు క్వారంటైన్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఏడు రోజులు త‌ర్వాతే మ‌ళ్లీ Coronavirus ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. నెగ‌టివ్ వ‌స్తేనే బ‌య‌ట‌కు రావాల‌ని పేర్కొంది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios