Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక పెట్టుబడి సదస్సు: కీలక ప్రసంగం చేయనున్న అమిత్ షా

ఈ ఏడాది మార్చిలో ముంబైలో జరిగే  ఇండియా గ్లోబల్ ఫోరం పెట్టుబడి సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.

Home Minister Amit Shah to headline India Global Forums NXT10 Investment Summit in Mumbai lns
Author
First Published Feb 13, 2024, 12:16 PM IST | Last Updated Feb 13, 2024, 12:16 PM IST

న్యూఢిల్లీ: ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో  ఈ ఏడాది మార్చి  6న ఇండియా గ్లోబల్ ఫోరం వార్షిక పెట్టుబడి సదస్సులో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ఉపన్యాసం చేయనున్నారు.

ఎన్ఎక్స్‌టి 10 ఇండియా గ్లోబల్ ఫోరం(ఐజీఎఫ్) భారత దేశం యొక్క రాబోయే దశాబ్దపు వృద్దిని పరిశీలిస్తుంది.  ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతుంది.భారత దేశ ఆర్ధిక వ్యవస్థ, భౌగోళిక,రాజకీయ స్థితిని రాబోయే పదేళ్లే ఏమి సూచిస్తుందో చర్చించనున్నారు.వాట్ ఎనలిస్ట్స్ గెట్ రాంగ్ అబౌంట్ ఇండియా అనే సెషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రసంగిస్తారు.  ఇండియా గ్లోబల్ ఫోరంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొనడం ఇదే తొలిసార అని ఐజీఎఫ్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ మనోజ్ లద్వా చెప్పారు.

గత పదేళ్లలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించింది. భారతదేశం ఇప్పుడు సాంకేతికత, ఆవిష్కరణలు, సైన్స్ లలో  ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని లద్వా చెప్పారు.  రానున్న మూడేళ్లలో  భారతదేశం  ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుంది.2030 నాటికి భారతదేశం  ఏడు ట్రిలియన్లకు  చేరుకుంటుందని అంచనా వేసినట్టుగా మనోజ్ లడ్వా  చెప్పారు.

ఎన్ఎక్స్‌టీ 10 సమ్మిట్ లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్ కూడ పాల్గొంటారు.మహారాష్ట్ర ఆర్ధిక ప్రగతిని ఆయన విశ్లేషిస్తారు. ఎన్ఎక్స్‌టీ 10 లో బెస్ట్ సెల్లింగ్ రచయితలు జెఫ్రీ ఆర్చర్, ఆమిష్ త్రిపాఠి లు కూడ పాల్గొంటారు.

భారత దేశలో వృద్ది వేగం, మార్పుల గురించి ఇండియా గ్లోబల్ ఫోరం  వివరించనుంది. వ్యాపారాలు, దేశాలు ఆవకాశాన్ని ఉపయోగించుకోవడంలో సహాయపడే గేట్ వే ఐజీఎఫ్.  ఈ విషయమై మరిన్ని వివరాలకు ఆర్తి సుబ్రమణియంను సంప్రదించవచ్చు.  aarti.subramaniam@indiaglobalforum.com అనే మెయిల్ ను సంప్రదించవచ్చు. లేదా +44794635472 నెంబర్ లో సంప్రదించాలని నిర్వహకులు కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios