న్యూఢిల్లీ:  జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాశ్మీర్ వ్యవహరంలో కేంద్రం నియమాలను ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ నేత ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ విభజన విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్భందంలో ఉంచి జమ్మ కాశ్మీర్‌ను విభజించారని అధిర్ రంజన్  ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు అందరూ సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు.