ఓ సెక్యూరిటీ గార్డ్ తన ప్రాణాలకు తెగించి వృత్తిధర్మాన్ని నిర్వర్తించి అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు. ఏటీఏం చోరీని అడ్డుకుని ప్రజాధనాన్ని దొంగల పాలు కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెడితే...

తమిళనాడు రామనాథపురంలో ఏటీఎం చోరీకి యత్నించిన ఓ దొంగను సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. రామన్ చెట్ సమీపంలోని ఏటీఎంలోకి హెల్మెట్ పెట్టుకుని ప్రవేశించిన ఓ దొంగ సెక్యూరిటీ గార్డుపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఏటీఎం సెంటర్ లోని లైట్స్, సీసీ కెమెరాలు ఆపేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

దుండగుడు దాడి చేస్తున్నా ఏ మాత్రం భయపడని సెక్యూరిటీ గార్డ్ అతని చేతిలోని రాడ్డును లాగేసుకున్నాడు. దొంగ ముఖం సీసీ కెమెరాల్లో కనిపించేలా అతడు ధరించిన హెల్మెట్ ను కూడా లాగేశారు. దీంతో భయపడ్డ దుండగుడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.