శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బూల్ ముజాహీద్దీన్  కమాండర్ సైఫుల్లా మృతి చెందాడు. 

శ్రీనగర్ రంగ్రేత్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ ఘటనలో మరో ఉగ్రవాది పోలీసులకు పట్టుబడ్డాడు.కచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 

దీంతో చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారీ మొత్తంలో ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకొన్నారు.శనివారం నాడు రాత్రి తమకు వచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో  ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.

ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ గా గుర్తించామని భద్రతా దళాలు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో  హిజ్బుల్ కీలక కమాండర్  మరణించినట్టుగా భద్రతా దళాలు చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు కొంత కాలంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ సెర్చ్ ఆపరేషన్స్ మంచి ఫలితాలను ఇస్తున్నాయని భద్రతా దళాలు చెబుతున్నాయి.