Mumbai: తండ్రి స్థానంలో ఉండి.. కంటికి రెప్పలా కాపాడాల్సిన సవితి తండ్రి తన మారు కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్ సమీపంలోని చోటు చేసుకుంది. నిందితుడు హెచ్ఐవీ బారిన పడిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.
Mumbai: మహిళలు, చిన్నారలు రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు.. ఆఖరికి సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ కరువైంది. తండ్రి స్థానంలో ఉండి.. కంటికి రెప్పలా కాపాడాల్సిన సవితి తండ్రి .. మారు కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవత్వం సిగ్గుతో చచ్చిపోదా...? అనే దారుణ ఘటన దక్షిణ ముంబైలోని మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బాంబే హాస్పిటల్ (Shanty Near Bombay Hospital) సమీపంలో గుడిసెలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి తన రెండో భార్యతో ఆమె కూతురుతో నివాసం ఉంటున్నాడు. అతనికి గత రెండేండ్ల కిత్రం.. హెచ్ఐవీ సోకింది. గత రెండు నెలలుగా 14 ఏండ్ల తన సవతి కూతురుని బెదిరించి, అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాధిత బాలిక ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు.
అత్యాచారం చేయడం వల్ల మైనర్ బాలికకు కూడా హెచ్ఐవీ సోకిందా అనే కోణంలో పోలీసులు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. తల్లి లేని సమయంలో బాలికపై అత్యాచారం ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. బాలిక తల్లి కూడా హెచ్ఐవి పాజిటివ్.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు మైనర్‌బాలికను బెదిరించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. బాలికను శిశు సంక్షేమ కమిటీ నిపుణుల బృందం బాలికను కౌన్సెలింగ్ చేస్తుంది.
