Asianet News TeluguAsianet News Telugu

History of EVM: ఈవీఎంల చరిత్ర ఏంటి? భారత్ లో ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు ఉపయోగించారో తెలుసా?  

History of EVM: అసలు ఈవీఎంలను ఎవరు కనిపెట్టారు? మన దేశంలో ఈవీఎంను తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? ఇంతకీ ఈవీఎంల చరిత్ర ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.!
 

History of EVM: Where was EVM first used in India? KRJ
Author
First Published Mar 16, 2024, 3:03 AM IST

History of EVM: ఎన్నికలంటే ఓట్ల పండుగ.. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును విధిగా వినియోగించుకునేవారు. గతంలో..  అభ్యర్థుల పేర్లను ఒక కాగితంపై ముద్రిస్తే .. నచ్చిన వారికి ఓటేసి ఆ కాగితాన్ని మడతపెట్టి పోలింగ్ బ్యాక్స్ లో వేసే వాళ్లు. ఆ తర్వాత వాటిని లెక్కించేవారు. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించేవారు.  అయితే.. ఈ తరానికి ఇలాంటి ఎన్నికల పద్ధతి గురించి తెలిసి ఉండటం తక్కువే..  ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్ని ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లే కనిపిస్తున్నాయి. అవే ఈవీఎంలు.. ఇవి నేతల తలరాతలు నిర్ణయించే మిషన్లు.. ఇంతకీ ఈవీఎం లను ఎవరు కనిపెట్టారు?  భారతదేశంలో తొలిసారిగా ఈవీఎంలను ఎప్పుడు వాడారు? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..!

భారతదేశంలో ఈవీఎంలకు దశాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. తొలి రెండు లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. అభ్యర్థుల పేర్లు వారి ఎన్నికల గుర్తులు ముద్రించిన పత్రాలను ఓటర్లకు ఇచ్చేవారు. ఇలా  ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. వారికి కేటాయించిన బాక్సులో ఆ ఓట్లను వేసేవారు. అయితే.. ఈ పద్దతి ద్వారా ట్యాంపరింగ్, రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో 1960-1961 లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం 1999 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది. అయితే.. ఈ విధానంలో కూడా పలు ఉండేవి. ఓట్ల లెక్కింపుకు చాలా సమయం పట్టేది. 

ఈ ఇబ్బందులను అధిగమించడానికి, నూతన సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా,  స్వేచ్ఛగా నిర్వహించడానికి అప్పటి ఎన్నికల సంఘం భావించింది. ఈ క్రమంలో 1977లో అప్పటికి ఎలక్షన్ కమిషనర్ శబ్ధర్ ఎన్నికల నిర్వహణకు ఒక పరికరం తయారు చేయాలని ఈసీ చేయాలని కోరారు.  రెండేళ్ల తర్వాత అంటే 1979లో ఈసీఐఎల్ లో ఒక ప్రోటేటర్ పీవీఎం తయారు చేసింది.

ఆ తరువాత  మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంని...  బిఎల్ కంపెనీ తయారు చేసింది.  ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎండి హనీఫా కనిపెట్టారు. ఈ ఈవీఎంలను తొలిసారి 1982 కేరళలోని నార్త్ పరావూరు ఉప ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగించారు. ఇదే సమయంలో మరో వాదన కూడా ఉంది.  1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలు వాడారు అని అంటారు. 1989లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు సంయుక్తంగా  ఈవిఎంలో డిజైన్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను  ఉపయోగించారు.  ఆ తర్వత 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో, 2003లోని అన్ని రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఈవీఎంలు వాడారు.దీంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2004 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు .

ఇదిలా ఉంటే.. పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ట్యాపరింగ్ జరుగుతుంది, ఒక వ్యక్తికి ఓటు వేస్తే మరో వ్యక్తికి ఓటు పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే.. ఈవీఎంలను ఉపయోగించడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవనే విమర్శలు కూడా వచ్చాయి.  ఈ క్రమంలో 2013లో నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఔటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిటర్( వివిప్యాడ్ ) ఉపయోగించారు. అంటే ఆ మన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన బ్యాక్స్ లో మనం ఎవరికి ఓటు వేశామనేది. సులభంగా తెలుసుకోవచ్చు. ఈవీఎం లో నమోదైనటువంటి ఓట్లు మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు దీంతో అవకాశం ఉంటుంది. అలాగే.. ఒక ఈవీఎం లో 15 వందల వరకు ఓట్లు వేయొచ్చు.  అలాగే.. 64 మంది అభ్యర్థులను మాత్రమే ఈవీఎం సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక బ్యాలెన్స్ యూనిట్ లో 16 చొప్పున నాలుగు యూనిట్లు మాత్రమే కనెక్ట్ చేయొచ్చు.  ఒకవేళ 64 మంది అభ్యర్థులు దాటితే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి ఉపయోగించాల్సిందే . 

ఒకరు ఒకసారి కన్నా ఎక్కువగా ప్రెస్ చేస్తే అవకాశం ఉంటుంది.  ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డు అవుతుంది మిషన్ లాక్ అవుతుంది మళ్లీ మళ్లీ బటన్స్ ప్రెస్ చేసిన ఓట్లు అయితే నమోదు కావు ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత మళ్ళా రెండో వ్యక్తి ఓటు వేయటానికి పంపించేంతవరకు అంటే బూత్ దగ్గరికి వచ్చేంతవరకు అది లాక్ లోనే ఉంటుంది ఎప్పుడైతే రెండో వ్యక్తి ఆ ఈవీఎం దగ్గరకు వస్తాడో..  అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి మాత్రమే రెండో వ్యక్తి ఓటేయటానికి అవకాశం కల్పిస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios