G20 summit: ఈ నెల 22 (మే 22) నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం జ‌మ్మూకాశ్మీర్ లో  మూడు అంచెల భద్రతాను అధికారులు ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వైలెన్స్ డ్రోన్ మానిటరింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ), మార్కోస్ కమాండోలను వేదికకు భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. జీ20 సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శ్రీనగర్ కార్యక్రమానికి అత్యధికంగా ప్రతినిధులు సింగపూర్ నుంచి వస్తున్నారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

G20 tourism meet in Srinagar: జ‌మ్మూకాశ్మీర్ లో చారిత్రాత్మ‌క స‌మావేశానికి వేదిక కానుంది. 2019లో జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో సోమవారం మూడో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ నెల 22 (మే 22) నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం జ‌మ్మూకాశ్మీర్ లో మూడు అంచెల భద్రతాను అధికారులు ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వైలెన్స్ డ్రోన్ మానిటరింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ), మార్కోస్ కమాండోలను వేదికకు భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. జీ20 సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శ్రీనగర్ కార్యక్రమానికి అత్యధికంగా ప్రతినిధులు సింగపూర్ నుంచి వస్తున్నారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ప్ర‌తినిధులకు స్వాగతం పలికేందుకు శ్రీనగర్ నగర గోడలు, రహదారులను అలంకరించారు. కాశ్మీర్ లో పర్యాటక, వ్యాపార రంగానికి ఊతమిచ్చేలా శ్రీనగర్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశాలను స్వాగతించేందుకు కాశ్మీర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. శ్రీనగర్ లో ప్రజల రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, జీ20 సదస్సు అతిథుల‌కు స్వాగతం పలికేందుకు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచి ఉన్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రజలు ప్రతినిధులకు వారు ప్ర‌త్యేక స్వాగ‌తం ప‌లుకుతారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ జీ20 శిఖరాగ్ర సమావేశం జమ్మూ కాశ్మీర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఇది కేంద్రపాలిత ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. 

కాశ్మీర్ లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాలనే భారత్ ఉద్దేశంపై పాకిస్థాన్ పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్ విమర్శలను తోసిపుచ్చిన భారత్, దేశం మొత్తంలో జీ20 సమావేశాలు నిర్వహిస్తున్నామ‌నీ, అందువల్ల జమ్మూ కాశ్మీర్, లడఖ్ ల‌లో సమావేశాలు నిర్వహించడం సహజంమేన‌నీ, ఎందుకంటే ఈ ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని భాగాలని పేర్కొంది. శ్రీనగర్, కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో జీ20 సమావేశాలను నిర్వహించాలని భారత్ తీసుకున్న నిర్ణయం బాధ్యతారాహిత్య చర్య అని పాకిస్థాన్ విమర్శించింది. "యావత్ భారతావనిలో, అన్ని నగరాల్లో, కొన్ని ప్రాంతాల్లో జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందువల్ల జ‌మ్ముకాశ్మీర్, లఢ‌ఖ్ ల‌లో సమావేశాలు నిర్వహించడం సహజం, ఎందుకంటే ఇవి భారతదేశంలో విడదీయరాని భాగాలు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. ఎంఈఏ వీక్లీ మీడియా బ్రీఫింగ్ లో అన్నారు. 

"అదే నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో సమావేశాలు జరుగుతున్నాయి.. ఇది మా సహజ ప్రతిస్పందన" అని ఎంఇఏ అధికార ప్రతినిధి తెలిపారు. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, ఎంఎస్ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ అనే ఐదు కీలక ప్రాధాన్య రంగాలపై జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం దృష్టి సారించనుంది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ఈ ప్రాంతం సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యం. ఈ కార్యక్రమంలో జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు పాల్గొంటారు.