గాంధీనగర్: ప్రధానిగా రెండో దఫా మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆయన తల్లి హీరాబెన్ తన నివాసంలోనే టీవీలో వీక్షించారు. మోడీ సోదరుడు పంకజ్ కూడ తల్లితో కలిసి ఈ వేడుకను తిలకించారు.

గాంధీన‌గర్‌కు సమీపంలోని రాయ్‌సన్ గ్రామంలోని తన నివాసంలో టీవీలో చూశారు. మోడీ ప్రమాణస్వీకారం చేయగానే హీరా బెన్ చప్పట్లు కొట్టి మురిసిపోయారు. హీరాబెన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోడీ గుజరాత్ వెళ్లి తల్లి ఆశీర్వాదం  తీసుకొన్నారు. తల్లికి పాదాభివందనం చేసి ఆమెతో కాసేపు గడిపారు.