Asianet News TeluguAsianet News Telugu

హిందువులు ఇళ్లల్లో పదునైన ఆయుధాలు ఉంచుకోవాలి.. కనీసం కత్తులనైనా దాచండి - బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరో సారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. హిందువులు అంతా తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లో పదునైన ఆయుధాలను ఉంచుకోవాలని సూచించారు. 

Hindus should keep sharp weapons in their homes.. hide at least knives - BJP MP Prajna Singh Thakur
Author
First Published Dec 26, 2022, 2:07 PM IST

హిందూ సమాజం తమను తాము రక్షించుకోవడానికి ఇళ్లలో పదునైన ఆయుధాలను ఉంచుకోవాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కోరారు.  తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉందని అన్నారు. ఆయుధాలు లేకపోతే కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు.

పండుగలను జ‌రుపుకొండి, కానీ కోవిడ్ జాగ్రత్తలు పాటించండి: ప్రధాని నరేంద్ర మోడీ

ఆదివారం కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు. వార్తా సంస్థ ‘పీటీఐ’ వెల్లడించిన నివేదికల ప్రకారం.. ‘‘మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి. కుదరకపోతే  కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులు లేకపోతే ఇంకా ఏదైనా పదునైన ఆయుధాలు పెట్టుకోండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో తెలియదు. ప్రతీ ఒక్కరికి తమను తాము కాపాడుకునే హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే దానికి తగిన విధంగా సమాధానం ఇవ్వడం మన హక్కు ’’ అని తెలిపారు.

‘లవ్ జిహాద్’ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారిపైనా ఠాకూర్ విరుచుకుపడ్డారు. ‘‘వారికి జిహాద్ అనే సంప్రదాయం ఉంది. వారు ప్రేమించినా, వారు దానిలో జిహాద్ చేస్తారు. మేము (హిందువులు) కూడా దేవుడిని ప్రేమిస్తాము. సన్యాసి తన దేవుడిని ప్రేమిస్తాడు.’’ అని తెలిపారు. 

టీఎంసీ నేతలను చెట్టుకు కట్టేసి.. బట్టలూడదీయండి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

‘‘దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో అణచివేతదారులను, పాపపు ప్రజలందరినీ తొలగించకపోతే నిజమైన ప్రేమ మనుగడ సాగించలేదు. లవ్ జిహాద్ లో పాల్గొన్న వారితో కూడా అదే విధంగా ప్రతిస్పందించండి. మీ కుమార్తెలను రక్షించండి. వారిలో మంచి విలువలను నింపండి.’’ అని ఆమె అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios