Asianet News TeluguAsianet News Telugu

ఇస్లాం కంటే హిందూ మతం చాలా పురాతనమైంది.. భారత ముస్లింలు మొదట హిందువులే - గులాం నబీ ఆజాద్

ముస్లిం మంతం కేవలం 1,500 సంవత్సరాల కిందట ఉద్భవించిందని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. కానీ అంతకు ముందు నుంచి హిందూ మతం ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న అధిక శాతం ముస్లింలు హిందూ మతం నుంచే వచ్చినవారని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hinduism is much older than Islam..Indian Muslims were Hindus first - Ghulam Nabi Azad..ISR
Author
First Published Aug 17, 2023, 12:48 PM IST

ఇస్లాం మతం కంటే హిందూ మతం చాలా పురాతనమైనదని కేంద్ర మాజీ మంత్రి, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ అన్నారు. భారత్ లో ప్రస్తుతం నివసిస్తున్న ముస్లింలు మొదట హిందువులే అని, తరువాత మతం మారారని అన్నారు. కేవలం 10-20  మంది ముస్లింలు మాత్రమే బయటి దేశాల నుంచి వచ్చారని అన్నారు. దోడా జిల్లాలోని థాత్రి ప్రాంతంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 1,500 సంవత్సరాల క్రితం ఇస్లాం ఉద్భవించిందని అన్నారు. కానీ హిందూ మతం దాని కంటే ముందు నుంచే ఉందని అన్నారు. కొంతమంది ముస్లింలు బయటి దేశాల నుండి వలస వచ్చి మొఘల్ సైన్యంలో చేరి ఉండొచ్చని అన్నారు. కానీ భారత్ లో ఎక్కువగా హిందూ మతం నుంచే ఇస్లాం మతంలోకి మత మార్పులు జరిగాయని తెలిపారు. 

‘‘హిందూ మతం అత్యంత ప్రాచీనమైన మతంగా నిలుస్తుంది, మొఘల్ సైన్యం కేవలం 10-20 మంది ముస్లింలను మాత్రమే భారతదేశానికి తీసుకువచ్చింది. మెజారిటీ ముస్లింలు మతమార్పిడులకు గురయ్యారు. మీకు చేరని అనేక సమస్యలను (సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి) నేను పార్లమెంటులో ప్రస్తావించాను. ఓ బీజేపీ నాయకుడు బయటి వ్యక్తుల రాక గురించి ప్రస్తావించాడు. కానీ ఇక్కుడున్న వారంతా బయటి వ్యక్తులు కాదని స్పష్టం చేశాను. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ఇస్లాం 1,500 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. కానీ హిందూ మతం దాని కంటే ముందే ఆవిర్భవించింది’’ అని ఆయన అన్నారు. భారతదేశంలో మతాల చారిత్రక నేపథ్యంపై చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

ఇదిలా ఉండగా.. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు పని చేశారు. ఆ పార్టీ నుంచి జమ్మూ కాశ్మీర్ సీఎంగా, అలాగే కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఉభయ సభల్లోనూ ఎంపీగా వ్యవహిరించారు. అయితే గతేడాది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభమయ్యే సమయంలో ఆయన పార్టీని వీడారు. తరువాత ఆయన సొంతంగా డెమొక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios