Asianet News TeluguAsianet News Telugu

దేవాలయ డోర్ మ్యాట్ పై రాహుల్ గాంధీ ... కాంగ్రెస్ అధినేతకు ఘోర అవమానం  

హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బిజెపితో పాటు హిందుత్వ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే  మహారాష్ట్రకు చెందిన ఓ ఆలయ నిర్వహకులు రాహుల్ ను ఘోరంగా అవమానించారు. 

Hindu temple uses Rahul Gandhis image as doormat AKP
Author
First Published Jul 8, 2024, 4:25 PM IST

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీని తీవ్రంగా అవమానించారు ఓ హిందూ దేవాలయ నిర్వహకులు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా  రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వివాదాస్పదం అయ్యింది. దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఎంపీ రాహుల్ పై బిజెపితో పాటు ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంప్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే మహారాష్ట్రకు చెందిన ఓ ఆలయ నిర్వహకులు వినూత్నంగా రాహుల్ ను అవమానించారు. ఓ హనుమాన్ మందిర్ ప్రధాన ద్వారంవద్ద రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్ ను ఏర్పాటుచేసారు. దీంతో ఆలయానికి వచ్చిపోయేవారు రాహుల్ ఫోటోను తొక్కుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇలా రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి విజయం సాధించింది. దీంతో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ హిందువలను అవమానించలా మాట్లాడారు. దీంతో అతడి ప్రసంగం వివాదాస్పదం అయ్యింది. 

హిందువులంతా హింసావాదులు, పోకిరీలు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తగా దుమారం రేపాయి. దీంతో రాహుల్ పై బిజెపి నాయకులు, హిందుత్వ సంఘాలు ఆగ్రహంలో రగిలిపోతున్నాయి. ఇలా మహారాష్ట్రకు చెందిన ఓ హనుమాన్ ఆలయ నిర్వహకులను సైతం రాహుల్ వ్యాఖ్యలు కోపం తెచ్చించాయి.  దీంతో రాహుల్ ఫోటోతో డోర్ మ్యాట్ ఏర్పాటుచేయగా ఆలయానికి వచ్చే భక్తులు తొక్కుకుంటూ వెళుతున్నారు. 

 

ఇక ఈ డోర్ మ్యాట్ పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు 'హిందువులు హింసావాదులు, పోకిరీలు అనడానికి ఎంత ధైర్యం' అన్న కామెంట్స్ రాసారు. ఇలా రాహుల్ గాంధీని అవమానిస్తూనే తీవ్రంగా హెచ్చరించారు. రాహుల్ గాంధీ డోర్ మ్యాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో రాహుల్ కు మద్దతుగా, మరికొందరు నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios