Hindi Imperialism: దేశంలో ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలంటూ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతోన్నాయి. ఇది భారతదేశ బహుళత్వంపై దాడి అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి
Hindi Imperialism: దేశంలో ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలంటూ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలను దాడి తీశాయి. ఇది భారతదేశ బహుళత్వంపై దాడి అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. "హిందీ సామ్రాజ్యవాదం" విధించే చర్యను తాము అడ్డుకుంటామని నొక్కిచెప్పాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందనీ, హిందీని విధించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా చేయడం ద్వారా ఆయన భాషకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.
రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో పేర్కొన్నట్లు హిందీ 'రాజ్ భాష' (అధికారిక భాష) అని, 'రాష్ట్ర భాష' (జాతీయ భాష) కాదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వాదించారు. "హిందీ సామ్రాజ్యవాదం భారతదేశానికి మరణశాసనం అవుతుందనీ, తాను హిందీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను, కానీ, అది ఎవరి గొంతులోనైనా దూసుకుపోవాలని కోరుకోననీ, అమిత్ షా వ్యాఖ్యలు హిందీకి అపచారం చేస్తుయని జైరాం రమేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. హోంమంత్రి హిందీ గురించి మాట్లాడకూడని ఉపన్యాసం ఇచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. హోంమంత్రి.. హిందీ గురించి ప్రబోధించడానికి ప్రయత్నించారనీ, ఇప్పటికే హిందీలో సమాధానమిచ్చాననీ. తాను హిందీకి మద్దతుదారుని, కానీ విధించడం, రెచ్చగొట్టే రాజకీయాలు, విభజన రాజకీయాలను పూరి కోల్పడమేననీ అన్నారు. హిందీ అంశాన్ని లేవనెత్తడం ద్వారా, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి హోం మంత్రి కూడా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
హిందీ ఆంశం ద్రవ్యోల్బణాన్ని లేదా నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుందా? లేదు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ లక్ష్యం డైగ్రెషన్, డైవర్షన్, నేనని అన్నారు. హిందీలోనే మాట్లాడాలని అనడం సాంస్కృతిక ఉగ్రవాదం లాంటిదని వ్యాఖ్యానించారు. హిందీని తాము గౌరవిస్తామని, అయితే ఆ భాషను బలవంతంగా రుద్దితే మాత్రం వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ చెప్పారు.హిందీని జాతీయ భాషగా రుద్దే బదులు.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోకూడదని కునాల్ ఘోష్ ప్రశ్నించారు. ప్రాంతీయ భాషలు, పార్టీల విలువను తగ్గించే అజెండా ఉన్నట్లు అమిత్ షా మాటలు వెల్లడిస్తున్నాయని శివసేన నేత మనీషా కయందే విమర్శించారు.
న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమైక్యత సాధనలో అధికార భాష కీలక పాత్ర పోషించే కలించేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా అన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది భారతీయ భాష అయి ఉండాలని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో 70 శాతం ఎజెండా హిందీలో సిద్ధమైందని సభ్యులకు తెలియజేశారు.
ప్రభుత్వం ఖచ్చితంగా హిందీకి ప్రాముఖ్యత ఇస్తుందని ప్రకటించారు. హిందీ నిఘంటువునూ సవరించాల్సి న అవసరం ఉందన్నారు. విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, హిందీ బోధనా పరీక్షలపైనా మరింత దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించే లా హిందీ మార్పుచెందితేగాని అది వ్యాప్తి చెందదని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, డిఎంకె హిందీ వ్యతిరేక ఆందోళనల్లో ముందంజలో ఉన్నారు. ఈ ఆంశం తరచుగా హింసాత్మకంగా మారుతోందని, హిందీపై షా జోరు భారతదేశం యొక్క 'సమగ్రత మరియు బహుళత్వానికి' విరుద్ధంగా ఉందని అన్నారు. ఇది దేశ సమగ్రతను ధ్వంసం చేస్తుందని అన్నారు. భారతదేశ బహుళత్వానికి నష్టం కలిగించే దిశగా బీజేపీ అగ్రనేతలు నిరంతరం కృషి చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశానికి 'హిందీ రాష్ట్రాలు సరిపోతాయా? భారత్ కు ఇతర రాష్ట్రాలు అవసరం లేదని అనుకుంటున్నారా?" అని అమిత్ షాను ట్విట్టర్ వేదికగా అడిగాడు. సమైక్యవాదానికి ఒకే భాష ఉపయోగపడదని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, హిందీ మాట్లాడని రాష్ట్రాలపై బిజెపి నేతృత్వంలోని కేంద్రం హిందీని విధించే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తామని పేర్కొంది. హిందీ భారతదేశ జాతీయ భాష కాదని పేర్కొన్న తృణమూల్.. “ఒక దేశం, ఒకే భాష, ఒకే మతం” అనే మిస్టర్ షా ఎజెండా నెరవేరదని అన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దాలని అమిత్ షా, బీజేపీ ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తారనీ, ఇంత వైవిధ్యం ఉన్న ఈ దేశ ప్రజలు ఇలాంటి వాటిని ఎన్నటికీ అంగీకరించరని తెలిపారు.