Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌‌లో బీజేపీ ప్రణాళికలు సక్సెస్ కాలేదా?.. ఓటర్లు ఎప్పటిలాగే తీర్పు ఇచ్చేశారా..!

హిమాచల్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రణాళికలు రచించింది. అయితే గమ్యాన్ని చేరుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా సఫలం కాలేదని అనిపిస్తోంది.

HImachal election results What factors keep BJP getting less seats than congress
Author
First Published Dec 8, 2022, 1:52 PM IST

హిమాచల్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రణాళికలు రచించింది. అయితే గమ్యాన్ని చేరుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా సఫలం కాలేదని అనిపిస్తోంది. ప్రస్తుతం హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుంగా.. బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందనే స్పష్టం అవుతుంది.  గత అసెంబ్లీ ఎన్నిలక్లో 44 స్థానాలు సాధించిన అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు 30లోపు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని అలా ఉంచితే.. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎక్కువ సీట్లు సాధించనున్నట్టుగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు ఎన్నికల సమావేశాలలో ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 11 ర్యాలీలలో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా 20 సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. అయితే ఇన్నీ చేసిన బీజేపీ అక్కడ రెండో స్థానానికే పరిమితం అయ్యేలా ఫలితాలు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

అయితే హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యుహాలు పెద్దగా సక్సెస్ కాలేదనే మాట వినిపిస్తుంది. చాలాకాలంగా ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మారుస్తున్న హిమాచల్ ఓటర్లు ఈసారి కూడా అదే విధమైన తీర్పు ఇచ్చేందుకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ నిరుద్యోగం, పెన్షన్లు, అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీమ్, ద్రవ్యోల్బణం, అభివృద్ధి వంటి అంశాలు కీలక భూమిక పోషించాయి. అయితే బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ హామీ ఇచ్చిన అది పెద్దగా హిమాచల్ ప్రభావం చూపలేకపోయిందనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో మైనారిటీ జనాభా 10 కంటే తక్కువ ఉన్నందున అది ఎన్నికల్లో విజయవకాశాలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకుండా పోయింది. చాలా మంది ఓటర్లు యూసీసీ స్వాగతిస్తున్నట్టు గానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా గానీ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. చంబా, పౌంటా సాహిబ్, సిర్మౌర్, సిమ్లాలో కొన్ని స్థానాలకే ముస్లింలు పరిమితమైనందున యూసీసీపై పెద్దగా చర్చనీయాంశంగా మారలేదు. 

ఇక, హిమాచల్‌లో పారిశ్రామికీకరణ లేకపోవడం వల్ల చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఆర్మీ ఉద్యోగులు, పనిచేసి రిటైర్డ్ అయినవారు కనిపిస్తారు. ఈ క్రమంలోనే పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తానని కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని ప్రజలు స్వాగతించడంలో ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అయితే బీజేపీ మాత్రం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలను ప్రస్తావించింది. అయితే చాలా మంది పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో యువతను రక్షణ దళాలకు వెళ్తున్నారు. అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా హిమాచల్‌లో కూడా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మారాయనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో సామాజిక వర్గాలు కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలోని మొత్తం 68 స్థానాల్లోని దాదాపు 40 నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లదే డామినేషన్‌గా కనిపిస్తుంది. రాష్ట్ర జనాభాలో ఈ రెండు సామాజిక వర్గాల జనాభే 50 శాతంగా ఉన్నాయి. రాజ్‌పుట్‌లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటే.. బ్రాహ్మణులు మాత్రం ఎప్పుడూ బీజేపీ వైపే ఉంటూ వస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ విఫలమైందనే చెప్పాలి. రాష్ట్రంలో ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి చెక్ పెట్టాలని భావించిన బీజేపీ.. ఓబీసీలతో పాటు.. 25 శాతం జనాభా ఉన్న ఎస్సీలను కూడా తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసింది. మరోవైపు హాతీ కమ్యూనిటీకి గిరిజన హోదా కల్పించాలనే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు కొద్ది నెలల క్రితం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల హాతీ కమ్యూనిటీలోని దాదాపు 1. 6 లక్షల మంది సభ్యులు ప్రయోజనం పొందుతారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు కావడంతో హిమాచల్ ఓటర్లు రాష్ట్రంలోని పరిస్థితులనే పరిగణలోకి తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios