హిమాచల్‌ ప్రదేశ్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు నాలుగు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. నేడు ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

హిమాచల్‌ ప్రదేశ్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు నాలుగు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. నేడు ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగి కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణం చేయించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గం బలం తొమ్మిదికి చేరింది. గత నెల 11న సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో.. ముఖేశ్‌ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇక, మంత్రివర్గంలో 

ఇక, మంత్రివర్గంలో సిమ్లా జిల్లాకు సింహభాగం దక్కింది. ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఆ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం లభించింది. బిలాస్‌పూర్, మండి, లాహౌల్, స్పితిలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12 మందికి మించకూడదు. దీంతో ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగానే ఉంది. 

హిమాచల్ మంత్రిమండలిలో.. ఐదుగురు రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన ఒక్కొక్క సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కూడా ఉన్నారు. విక్రమాదిత్య సింగ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక, మిగిలివారి విషయానికి వస్తే.. సీనియర్ నేత ధని రామ్ శాండిల్.. మాజీ మంత్రి, సోలన్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చందర్ కుమార్.. మాజీ మంత్రి, కాంగ్రా జిల్లాలోని జవాలి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. హర్షవర్ధన్ చౌహాన్.. సిర్మౌర్ జిల్లాలోని షిల్లై నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగత్ సింగ్ నేగి.. మాజీ డిప్యూటీ స్పీకర్, గిరిజన కిన్నౌర్ జిల్లా నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోహిత్ ఠాకూర్, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిరుధ్ సింగ్‌లకు కూడా కేబినెట్‌లో బెర్త్ దక్కింది.

మంత్రివర్గ విస్తరణకు ముందు.. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆరుగురు సీపీఎస్‌లను (ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి) నియమించారు. సీపీఎస్‌లలో కులు నుంచి సుందర్ సింగ్ ఠాకూర్, సిమ్లా జిల్లాలోని రోహ్రూ నుంచి మోహన్ లాల్ బ్రగ్తా, సోలన్ జిల్లాలోని డూన్ నుంచి రామ్ కుమార్ చౌదరి, పాలంపూర్ నుంచి ఆశిష్ బుటైల్, కాంగ్రా జిల్లాలోని బైజ్నాథ్ నుంచి కిషోరి లాల్, సోలన్ జిల్లాలోని అర్కీ నుంచి సంజయ్ అవస్తీ ఉన్నారు.