Asianet News TeluguAsianet News Telugu

హిజ్రా.. ప్రేమిస్తున్నానని 15మందిని నమ్మించి.. ఏకంగా 8మందిని వివాహం చేసుకుని.. లక్షల్లో కుచ్చుటోపీ..

ఓ హిజ్రా ప్రేమిస్తున్నానని చెప్పి 8 మంది పురుషుల్ని వివాహం చేసుకుంది. వారి దగ్గర నగదు, నగలు కాజేసి ఎంచక్కా చెక్కేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. 

Hijra Married 8 people and cheated lakhs of rupees in tamilnadu
Author
First Published Sep 21, 2022, 7:54 AM IST

తమిళనాడు : తమిళనాడులో ఓ గమ్మత్తైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ హిజ్రా ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకుని.. కోట్లల్లో నగదు, నగలు కాజేసింది. ఈ హిజ్రాపై తిరుచ్చిలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బబితా రోస్ అనే హిజ్రా ప్రేమించానంటూ 15 మంది పురుషులను నమ్మించింది. వారిలో వేర్వేరు జిల్లాలకు చెందిన ఎనిమిది మందిని వివాహం కూడా చేసుకుంది. ఆ తర్వాత వారి నుంచి లక్షల్లో నగదు, బంగారం కాజేసింది.  మోసపోయిన ఈరోడ్, తిరుచి, కడలూర్, కళ్లకురిచ్చి, కోయంబత్తూర్, విరుదునగర్, నాగర్ కోవిల్ తదితర ప్రాంతాలకు చెందిన బాధిత పురుషులు మంగళవారం తిరుచి ఎస్పీ సుజిత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. హిజ్రాను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 13న కటక్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన మగవాడు వేరే మహిళను ప్రేమించినా, వివాహేతర సంబంధం పెట్టుకున్నా ఆ కుటుంబంలో తీవ్ర అలజడి చెలరేగుతుంది. కలహండి జిల్లా నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్ కుట్ గ్రామంలో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్ కు అయిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. 

పోలీసులకు లంచం ఇవ్వడానికి కుమార్తెలను అమ్ముకుంటున్నారు .. సొంత సర్కారు మీద ప్రజ్ఞా ఠాకూర్‌ సంచ‌ల‌నవ్యాఖ్య‌లు

ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. యేడాది క్రితం ఆయన గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది సంగీత. 

కాగా, జూలైలో ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులకు మహిళలు, పసివాళ్లు, యువతులు, ముసలివాళ్లు అన్న తేడా కాదు.. స్త్రీ, పురుషుడు, హిజ్రా అనే తేడాలూ లేకుండా పోయాయి. కన్ను పడితే చాలా వారిమీద అత్యాచారం చేసి కానీ వదిలిపెట్టడం లేదు. అలా ఓ హిజ్రా మీద అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఏపీలోని పులివెందులలో ఓ హిజ్రాపై పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం ఓ హిజ్రా (35) పట్టణంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. రెండు రోజుల కిందట పదిమంది ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా  పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. 

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత హిజ్రా  13 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని దిశ యాప్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే దీనిమీద దర్యాప్తు చేపట్టారు.  పులివెందులకు చెందిన పీ చక్రధర్, కే చలపతి, ఏ బాల గంగిరెడ్డి, పి గురు ప్రసాద్, కే కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి. జయచంద్ర శేఖర్ రెడ్డి, ఎం హరికృష్ణరెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ఓ ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర, షాకీర్, సుభాష్.. లు నిందితులుగా గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios