గన్నవరం విమానాశ్రయంలో విమానం హైజాక్ కలకలం రేగింది. గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ... దానిని పాకిస్తాన్‌కు తరలిస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన విమానాశ్రయాల దగ్గరా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అదనపు బలగాలను మోహరించడంతో పాటు లగేజ్, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ బెదిరింపు కాల్ ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు.