Hijab verdict: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పును స‌వాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖాలు చేశారు పిటిష‌నర్లు. ఈ పిటిష‌న్ ను స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై హోలీ తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది. విచారణ ఎప్పుడు చేపడుతామనేది కూడా హోలీ తర్వాతే లిస్టింగ్‌ చేస్తామని తెలిపింది. విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది . దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టు మెట్లెక్కారు.  

Hijab verdict:  దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో స్కూల్ Uniform ను ధరించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు యూనిఫామ్‌పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది. 

క‌ర్ణాట‌క హైకోర్టు వెలువ‌రించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (supreme court)లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిష‌న్ ను స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. హిజాబ్‌ అంశంపై హోలీ తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. విచారణ ఎప్పుడు చేపడుతామనేది కూడా హోలీ తర్వాతే లిస్టింగ్‌ చేస్తామని తెలిపింది.

అప్పీలుదారుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అత్యవసర జాబితాను కోరారు. “మిస్టర్ హెగ్డే, మాకు సమయం ఇవ్వండి. మనం చుద్దాం. మేం విషయాన్ని పోస్ట్ చేస్తాం’’ అని సీజేఐ రమణ బదులిచ్చారు. హోలీ కార‌ణంగా కోర్టు గురువారం నుండి మూసివేయబడుతుంది, మార్చి 21న తిరిగి తెరవబడుతుందని తెలిపారు. ఈ క్ర‌మంలో బాధిత విద్యార్థులు త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పరీక్షలకు హాజ‌రుకావాల‌ని కోరారు. మరోవైపు, హిజాబ్‌ను నిషేధించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఉడుపిలోని ముస్లిం విద్యార్థినులు బుధవారం కాలేజీకి హాజరు కాలేదు. హిజాబ్‌పై నిషేధం విధిస్తే తాము కాలేజీకి వెళ్లబోమని, న్యాయం కోసం పోరాడతామని వారు తేల్చి చెప్పారు.

ఉడిపిలోని ప్రీ యూనివర్శిటీ కాలేజీల్లో చదువుతున్న ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్‌లు ధరించే హక్కును కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ..ఇస్లామిక్ విశ్వాసంలో ముఖ్యమైన ఆచారం కాదనీ, అలాగే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని HC తీర్పు చెప్పింది. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును కూడా క‌ర్ణాట‌క హైకోర్టు సమర్థించింది. 

ప్ర‌భుత్వం సూచించిన యూనిఫాంను ధ‌రించాలని, క‌ళాశాల యూనిఫారమ్‌ల కోసం నిబంధనల ప్రకారం అటువంటి నియంత్రణలు "రాజ్యాంగపరం గా అనుమతించదగినవి" అని తీర్పునిచ్చింది. హిజాబ్‌తో తరగతులకు హాజరుకాకుండా బాలికలను అడ్డుకున్న ఉడిపిలోని ప్రభుత్వ కళాశాల అధికారులపై ఎటువంటి కేసు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక విద్యా చట్టం 1983 ప్ర‌కారం.. విద్యార్థులు తప్పనిసరిగా ప్ర‌భుత్వం సూచించిన యూనిఫారాన్ని ధ‌రించాలి. హిజాబ్ ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కు పరిధిలోకి వస్తుందని, మనస్సాక్షి స్వేచ్ఛ గోప్యత హక్కులో ఒక భాగమని పిటిష‌న‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతో క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.