బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాస్త ఆలస్యంగా హిజాబ్ మీద జరుగుతున్న వివాదంపై స్పందించింది. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో దీనికి సంబంధించిన కథనాన్ని షేర్ చేసింది. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.
ముంబయి : బాలీవుడ్ నటి Kangana Ranaut మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. Hijab పై తనదైన శైలిలో స్పందించారు. హిజాబ్ వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురువారం స్పందించారు. "మీరు ధైర్యాన్ని ప్రదర్శించాలనుకుంటే, Afghanistanలో బుర్ఖా ధరించకుండా చూపించండి" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కంగనా రనౌత్ గురువారం తన Instagram Story దీనిమీద పోస్ట్ చేశారు. దీంట్లో ఒకదానిలో మహిళలకు సంబంధించిన రెండు విభిన్న ఫోటోలను కోల్లెజ్ చేసి షేర్ చేస్తూ.. "విముక్తి పొందడం నేర్చుకోండి... మిమ్మల్ని మీరు బంధించుకోకండి’’ అంటూ కోట్ చేసింది.
కోల్లాజ్ చేసిన ఫొటోల్లో ఒకటి స్విమ్ సూట్ లో ఉన్న మహిళల ఫొటో కాగా, మరొకటి బురఖాల్లో ఉన్నవారి ఫొటో "ఇరాన్. 1973, ప్రస్తుతం.. యాభై ఏళ్ల కాలగమనంలో బికినీ నుండి బుర్ఖా వరకు ప్రయాణం. చరిత్ర నుండి నేర్చుకోని వారు దానిని పునరావృతం చేయడం విచారకరం" అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
క్యాంపస్‌లలో బాలికలు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని అనేక పాఠశాలలు, కళాశాలల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కర్నాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలో ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకాకుండా ఆరుగురు ముస్లిం బాలికలను నిషేధించడంతో వివాదం రాజుకుంది. హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొందరు హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు.
గురువారం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థులతో సహా పలువురు పిటిషనర్లు.. పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరలేదు. కాలేజీల్లో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గురువారం విచారించింది. దీనిమీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రాల్లోని కళాశాలలు తిరిగి తెరవవచ్చు, అయితే విషయం పెండింగ్‌లో ఉన్నంత వరకు విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడానికి అనుమతించరాదని అన్నారు.
మరోవైపు నిరసనల కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను సోమవారం నుంచి దశలవారీగా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1-10 తరగతుల విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి అనుమతించబడతారు. హిజాబ్ సమస్య ఎక్కువైన కళాశాలలకు సంబంధించిన నిర్ణయం తర్వాత తీసుకుంటారు.
ఇదిలా ఉండగా, Hijabఅంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని Supreme Court చీఫ్ జస్టిస్ NV Ramana అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో ఈ పిటిషన్ ను విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. విద్యాసంస్థలు హిజాబ్ ఆంక్షలకు సంబంధించిన విషయమై నిర్ణయం తీసుకొనే వరకు మతపరమైన దుస్తులు ధరించవద్దని Karnataka High Court గురువారం నాడు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ కేసును అత్యవసరంగా విచారణగా చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసుపై అత్యవసర విచారణను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అయితే ఈ విషయమై కర్ణాటక హైకోర్టు నిర్ణయం ముందుగా తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ కు సూచించింది.ఈ సమస్యను ఢిల్లీకి తీసుకు రావొద్దని, జాతీయ సమస్యగా కూడా మార్చొద్దని సుప్రీంకోర్టు పిటిషనర్ కు హితవు పలికింది.
