హిందూ-మూస్లిం పేరుతో దేశ విభజనకు కారణమైంది కాంగ్రెస్సే అని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ విమర్శించారు. కర్నాకటలో కొనసాగుతున్న హిాజాబ్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న హిజాబ్ (hijab) వివాదంపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ (haryana home minister anil vij) వ్యాఖ్యలు చేశారు. భారతదేశం విడిపోవడానికి దారితీసిన విభజన విధానాలకు కాంగ్రెస్సే (congress) బీజం వేసిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ-ముస్లిం (hindu-musilm) పేరుతో కాంగ్రెస్ దేశాన్ని విభజించిందని ఆరోపించారు.
“ కాంగ్రెస్ వేసిన విభజన బీజం వల్లనే దేశం ఈ నాటికీ భారత్ శాంతితో జీవించడం లేదు. కొన్నిసార్లు ఉగ్రవాదుల రూపంలో, కొన్నిసార్లు హిజాబ్‌ల రూపంలో ఇది అంశాతిని నెలకొల్పుతోంది. హిందువులు, ముస్లింల పేరుతో దేశాన్ని విభజించారు’’ అని అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎప్పుడూ విభజన విధానాలను నడుపుతోందని, ఇది తప్ప ఆ పార్టీ ఇంకేమీ ఆలోచించదని తెలిపారు.
కాంగ్రెస్ చేసిన ఇలాంటి ఆలోచనల వల్లే భారతదేశ విభజనకు కారణమయ్యిందని మంత్రి అనిల్ విజ్ అన్నారు. కాంగ్రెస్ తనను తాను సెక్యులర్ (secular) అని చెప్పుకునేదని, అయితే మత ప్రాతిపదికన, హిందూ-ముస్లిం పేరుతో దేశాన్ని విభజించింది దుయ్యబట్టారు. గతంలో కర్ణాటక హైకోర్టు జారీ చేసిన హిజాబ్ ఆదేశాలను విజ్ స్వాగతించారు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ( Rajyavardhan Singh Rathore) వివాదానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు పోలరైజేషన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, దేశ ప్రగతిని అడ్డుకుంటున్నారని బీజేపీ (bjp) దుయ్యబట్టింది.
“ చాలా మంది విద్యార్థులు పాఠశాలల్లో హిజాబ్ ధరించడం మొదలుపెట్టడం విచిత్రంగా ఉంది. కొన్ని పార్టీలు బీజేపీ మతవాదం, విభజనను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పాఠశాలలకు సరైన యూనిఫాం ఉందని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మారితే వారు చట్టాన్ని అనుసరించాలి ’’ అని
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే (ramdas athawale)స్పందించారు. మతాన్ని పాఠశాలలకు తీసుకెళ్లవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఇదిలా ఉండగా.. కేరళ గవర్నర్ (kerala governor) ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) ఈ వివాదంపై స్పందించారు. తలపాగా (turban) సిక్కు మతానికి చెందినదని చెప్పే రీతిలో ఇస్లాంలో హిజాబ్ (hijab) ముఖ్యమైన భాగం కాదని ఆయన అన్నారు. ముస్లిం బాలికలు అభివృద్ధి చెందకుండా చేయడంలో భాగమే ఈ హిజాబ్ కుట్ర అని ఆయన తెలిపారు. విద్యార్థులు తరగతి గదులకు తిరిగి వెళ్లి చదువును కొనసాగించాలని గవర్నర్ కోరారు. శనివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఖురాన్ (Quran) లో హిజాబ్ విషయంలో ఏడుసార్లు ప్రస్తావన ఉందని అన్నారు. అయితే అది మహిళల డ్రెస్ కోడ్‌తో సంబంధం లేదని చెప్పారు. “ హిజాబ్ వివాదం ముస్లిం బాలికల చదువును ఆపే కుట్ర. ముస్లిం బాలికలు ఇప్పుడు చదువుకుని అనుకున్నది సాధిస్తున్నారు. విద్యార్థులు తమ తరగతి గదులకు తిరిగి వెళ్లి చదువుకోవాలని నేను సూచిస్తున్నాను ’’ అని ఆయన అన్నారు. ఈ హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ వివాదంపై కర్నాటక హై కోర్టులో విచారణ జరుగుతోంది.
