ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళుతున్న రైతులను అడ్డుకున్నారు పోలీసులు. రేపు సింఘూ బోర్డర్ దగ్గర ఆందోళనలకు పిలుపునిచ్చారు రైతులు.

దీంతో రాజస్థాన్ నుంచి ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్లపై బైఠాయించారు రైతులు. ఎముకలు కొరికే చలిలో నిరసన తెలుపుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు.